Begin typing your search above and press return to search.

కూతురి విషయంలో రాజశేఖర్ ఓపెనయ్యాడు

By:  Tupaki Desk   |   9 July 2017 6:42 AM GMT
కూతురి విషయంలో రాజశేఖర్ ఓపెనయ్యాడు
X
సినీ పరిశ్రమలో హీరోల కొడుకులు వాళ్ల వారసత్వాన్ని అందుకోవడం మామూలే. వాళ్లకు మంచి ప్రోత్సాహం ఉంటుంది. వాళ్ల కెరీర్ ముందే డిసైడైపోతుంది. కానీ హీరోల కూతుళ్లు మాత్రం ఇటువైపు చూడరు. ఎవరికైనా సినిమాలపై ఆసక్తి ఉన్నా సరే.. లోపల దాచుకోవాల్సిందే. హీరోల సంగతేమో కానీ.. అభిమానులే వాళ్ల అరంగేట్రాన్ని వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది. ఐతే ఈ మధ్య నెమ్మదిగా ఇండస్ట్రీలో మార్పు వస్తోంది. సినీ ఫ్యామిలీల నుంచి అమ్మాయిలు కూడా హీరోయిన్లవుతున్నారు. మంచు లక్ష్మి.. నిహారిక అందుకు ఉదాహరణ. ఈ కోవలోనే రాజశేఖర్ తనయురాలు శివాని కూడా తెరంగేట్రం చేయబోతోంది. శివాని తెరంగేట్రం విషయంలో తనకెలాంటి అభ్యంతరమూ లేదంటున్నాడు రాజశేఖర్. కూతురు సినిమాల్లోకి రావడంపై ఓ ఇంటర్వ్యూలో ఆయన ఓపెనయ్యాడు. తన అభిప్రాయాల్ని మొహమాటం లేకుండా చెప్పేశాడు. ఆయనేమన్నారంటే..

‘‘మా కూతుర్ని సినిమాల్లోకి తీసుకురావడంలో ఎలాంటి తప్పూ లేదని మా అభిప్రాయం. తనకు నచ్చిన వృత్తిని ఎన్నుకుంటానని చెప్పినప్పుడు వద్దనే హక్కు మాకు లేదు. ఈ వృత్తిలో అభ్యంతరకరమైన విషయాలేమీ మాకు కనిపించడం లేదు. సినీ రంగంలో హిపోక్రసీ ఎక్కువ. మనం వేరే వాళ్ల ఆడపిల్లల మీద చేతులు వేయవచ్చు.. జీవితాలతో ఆడుకోవచ్చు. కానీ మన ఆడపిల్లలు మాత్రం బాగుండాలి అనుకొనే వ్యక్తులు ఇక్కడ ఎక్కువమంది ఉంటారు. ఆడవాళ్లు సినిమాల్లోకి వస్తే చెడిపోతారని.. కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయం గతంలో ఎక్కువగా ఉండేది. ఇప్పుడూ కొంత ఉంది తగ్గింది. డాక్టర్‌ కొడుకు డాక్టర్‌ కావచ్చు, లాయర్‌ కొడుకు లాయర్‌ అయితే తప్పు లేదు. కానీ హీరోల కూతుళ్లు హీరోయిన్లయితే తప్పేంటి? నాకు కొడుకు ఉంటే హీరోగా పరిచయం చేసేవాడిని. ఆ అవకాశం లేదు కనుక నా కూతుర్ని హీరోయిన్ని చేస్తున్నాను. మా అమ్మాయి తనకు నటించాలనే కోరిక ఉందని చెప్పినప్పుడు నేను వద్దని అనలేదు. ముందు చదువు పూర్తి చేయమన్నాను. నటనను హాబీగా పెట్టుకుని మరో వృత్తిని ఎంచుకోమన్నాను. సినిమాల్ని పూర్తి స్థాయి కెరీర్ గా మాత్రం తీసుకోవద్దన్నాను. మా చిన్నమ్మాయికి కూడా సినిమాల్లోకి రావాలని ఉంది. తనను కూడా ప్రోత్సహిస్తాను’’ అని రాజశేఖర్ తెలిపాడు.