Begin typing your search above and press return to search.
సంచలన విషయాలు వెల్లడించిన రాజశేఖర్
By: Tupaki Desk | 9 July 2017 7:30 AM GMTసీనియర్ హీరో రాజశేఖర్ గురించి ఇండస్ట్రీలో రకరకాల రూమర్లు వస్తుంటాయి. ఆ మధ్య తేజ దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమా మొదలుపెట్టి.. దాన్ని మధ్యలో వదిలేసినపుడు కూడా ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. రాజశేఖర్ షూటింగుకి లేటొచ్చాడని.. దానిపై తేజకు కోపం వచ్చి సినిమా ఆపేసే వరకు వెళ్లిందని చెప్పుకున్నారు. మరోవైపు రాజశేఖర్ ను వేరే సినిమాలకు విలన్ పాత్ర కోసం అడిగితే ఆయన చేయనన్నారని అన్నారు. ఇలా ఈ సీనియర్ హీరోగా గురించి చాలా రూమర్లే ఉన్నాయి ఇండస్ట్రీలో. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజశేఖర్ ఈ రూమర్లన్నింటిపైనా స్పందించారు. కొన్ని సంచలన విషయాలు వెల్లడించాడు.
విలన్ పాత్ర చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ఆ మధ్య దర్శకుడు తేజగారు వచ్చి ఓ కథ చెప్పారు. అందులో విలన్ పాత్ర నాకు బాగా నచ్చింది. చేయడానికి ఒప్పుకున్నాను. కానీ క్లైమాక్స్ విషయంలో తేజ గారికి.. నాకు ఏకాభిప్రాయం కుదరక పోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశాం. ‘రామ్‌చరణ్ నటించిన ‘ధృవ’ సినిమాలో విలన్ వేషానికి మొదట నన్నే అడిగారు. దర్శకుడు సురేందర్ రెడ్డి జీవితతో విషయం చెప్పాడు. సూపర్ క్యారెక్టర్ కావడంతో చేస్తానన్నాను. కానీ తర్వాత నిర్మాత ఎన్వీ ప్రసాద్ గారు కలిసి తమిళంలో నటించిన అరవింద్ స్వామినే పెట్టుకొంటున్నామని.. ఆయన నటించిన సోలో షాట్లను తమిళం నుంచి అలాగే తీసుకుంటున్నామని.. నన్ను పెట్టుకుంటే మళ్లీ ఆ సీన్లు రీషూట్ చేయాలని జీవితకి చెప్పారట. సరేలే పర్వాలేదనుకున్నా. కె.ఎస్.రవికుమార్ గారి దర్శకత్వంలో బాలకృష్ణ గారు నటించే సినిమాలో విలన్ వేషానికి నన్ను అడిగారు. బాలయ్య గారే విలన్ పాత్రకు నన్ను సూచించారని రచయిత నాకు చెప్పాడు. కానీ అది రొటీన్ విలన్ పాత్ర అని తెలిసింది. బాలకృష్ణ గారు నాకు మంచి స్నేహితులు. కథ విన్నాక క్యారెక్టర్ బాగోలేదని చెప్పడం బాగుండదని చెప్పి ఆ కథ కూడా వినలేదు. చిరంజీవి గారు నటించిన ‘స్నేహం కోసం’లో విజయ్ కుమార్ గారు చేసిన పాత్రను నేనే చేస్తానని అడిగాను. కానీ నేను చేస్తే చిన్నవాడిని అయిపోతానని చిరంజీవి గారు వద్దన్నారు. నేనిప్పుడు హీరోగానే చేయాలనుకోవడం లేదు. పాత్ర నచ్చితే విలన్ గా అయినా.. ముసలివాడిగా అయినా చేయడానికి రెడీ’’ అని రాజశేఖర్ తెలిపాడు.