Begin typing your search above and press return to search.
రియల్ లైఫ్ లోనే కాదు రీల్ లో కూడా...
By: Tupaki Desk | 11 Jan 2022 10:30 AM GMTయాంగ్రీ యంగ్ మెన్ డా. రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం `శేఖర్`. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఓ మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత కొంత కాలంగా కెరీర్ పరంగా వెనకబడిన డా. రాజశేఖర్ ఈ సినిమాతో సర్ప్రైజ్ షాక్ ఇవ్వబోతున్నారు. ఇందులో తన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ తో కలిసి నటిస్తున్నారాయన. నిజ జీవితంలో తండ్రీ కూతుళ్లైన ఈ ఇద్దరు సినిమాలోనూ అదే పాత్రల్లో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్నారు.
ఇటీవల `అద్భుతం` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి పేరు తెచ్చుకున్నరాజశేఖర్ పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ ఈ చిత్రంలో రాజశేఖర్ కు కూతురిగా కీలక పాత్రలో నటించింది. వెండితెరపై డా. రాజశేఖర్, శివానీ తండ్రి కూతుళ్లుగా నటిస్తున్న మొట్టమొదటి చిత్రమిదే. ఈ సందర్భంగా వీరిద్దరికి సంబంధించిన ఓ స్టిల్‌ని మేకర్స్ మంగళవారం విడుదల చేశారు.
డా. రాజశేఖర్ నటిస్తున్న 91వ చిత్రమిది. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్‌ప్లే కూడా అందించారు. వంకాయలపాటి మురళీకృష్ణ పసమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ సంస్థలపై బీరం సుధాకర్‌రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మించారు.
రాజశేఖర్, శివాని మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలిచేలా వున్నాయి. ఇదే విషయాన్ని జీవితా రాజశేఖర్ స్పష్టం చేశారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, నిజజీవితంలో ఎలా వుంటారో.. సినిమాలో కూడా అలాగే వున్నారని, చాలా సహజంగా నటించారని తెలిపారు.
ఇప్పటికే విడుదల చేసిన ప్కరచార చిత్రాలు, ఫస్ట్ గ్లింప్స్, లవ్ గంట మోగిందంటే పాటకు విశేష స్పందన లభించిందని, సినిమా కూడా ఆకట్టుకుంటుందని గట్టి నమ్మకంతో వున్నామని జీవిత తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతన్న ఈ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
యాంగ్రీ యంగ్ మెన్ డా. రాజశేఖర్ ఈ సారి కూతురుతో వస్తూ షాకిస్తుండటంతో ఆయన అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా వున్నారట. మలయాళంలో ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచిన కథ కావడంతో డా. రాజశేఖర్, జీవిత కూడా ఈ మూవీ ఫలితంపై గట్టి నమ్మకంతో వున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.