Begin typing your search above and press return to search.
ఆస్పత్రిలో వేణుమాధవ్ చిట్ట చివరి ఫోటో
By: Tupaki Desk | 26 Sep 2019 9:18 AM GMTప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మరణం అభిమానుల్ని కలచివేస్తోంది. నేటి మధ్యాహ్నం వేణుమాధవ్ పార్ధివదేహాన్ని హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ వద్ద అభిమానుల సందర్శనార్థం ఉంచారు. వేణుమాధవ్ తో అనుబంధం ఉన్న ప్రతి ఆర్టిస్టు ఆయనతో తమ జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు.
వేణుమాధవ్ మరణం తమకు తీరని లోటని హీరో రాజశేఖర్ అన్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాజశేఖర్ ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ``వేణుమాధవ్ మా కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉండేవారు. నన్ను బావా అని.. జీవితను అక్క అని పిలిచేవాడు. ప్రతి పండక్కి తప్పకుండా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపేవాడు. ఒకవేళ కుదరకుంటే కనీసం మెసేజ్ పెట్టేవాడు`` అంతటి అనుబంధం ఉందని రాజశేఖర్ తెలిపారు.
పరిశ్రమలో పదిమందికి సాయం చేసిన దానగుణం ఉన్న నటుడిగా అతడికి పేరుంది. అందరినీ ఏదో ఒక రకంగా కలుపుకుని పోతూ కుటుంబ సభ్యుడిలా కలిసిపోయే గుణం అతడికి ఆ స్థాయిని ఇచ్చింది. వేణుమాధవ్ అనారోగ్యానికి గురైనప్పుడు జీవితతో కలిసి హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించి వచ్చాను.. కానీ ఈలోగానే ఇలా జరగడం దురదృష్టకరం.. మంచి మనిషి ఇంత త్వరగా లోకాన్ని విడిచి వెళతాడని అనుకోలేదు అని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. వేణుమాధవ్ తో కలిసి ఉన్నప్పటి ఫోటోని ఆయన షేర్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నప్పటి ఫోటో ఇది. ఈ ఫోటోలో అప్పటికే ఎంతో బలహీనపడి కనిపిస్తున్నారు. రాజశేఖర్ తో కలిసి వేణుమాధవ్ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. రాజ సింహం-ఒక్కడు చాలు-మనసున్న మారాజు-గోరింటాకు చిత్రాల్లో తన నటనకు.. హాస్యానికి మంచి పేరు వచ్చింది.