Begin typing your search above and press return to search.

సల్మాన్ ను వీడని కృష్ణజింక కష్టాలు!

By:  Tupaki Desk   |   19 Oct 2016 6:58 AM GMT
సల్మాన్ ను వీడని కృష్ణజింక కష్టాలు!
X
బాలీవుడ్ లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు ఉన్న వివాదాల సంఖ్య - కేసుల సంఖ్య తక్కువేమీ కాదు. ఇదే సమయంలో భారీ స్టేట్ మెంట్స్ ఇచ్చి మరికొన్ని సందర్భాల్లో సమస్యలు తెచ్చుకుంటుంటారు. ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే తాజాగా కృష్ణజింకల కు సంబందించిన కేసు నుంచి ఉపసమనం పొందిన సల్మాన్ కు మరోసారి ఆ కృష్ణజింకల సమస్యల తప్పేలా కనిపించడం లేదు. కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్ పై రాజస్తాన్ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కాగా 1998లో జోధ్‌ పూర్‌ కు సమీపంలోని భావద్ - మథానియా ప్రాంతాల్లో ఓ కృష్ణజింకను - ఓ మామూలు జింకను వేటాడి చంపినట్టు సల్మాన్ తోపాటు మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి. సల్మాన్‌ పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51 కింద ఈ కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబందించి ఈ ఏడాది జూలై 25న ఆ రాష్ట్ర హైకోర్టు సల్మాన్ నిర్ధోషి అంటూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అంతకముందు ట్రయల్ కోర్టు సల్మాన్‌ ను ఈ కృష్ణజింకల కేసుకు సంబందించి దోషిగా నిర్ధారించి.. ఒక కేసులో ఏడాది జైలు శిక్ష - మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

దీనిపై సల్మాన్ సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకోగా, మిథానియా కేసులో సల్మాన్ అప్పీలును తిరస్కరించిన కోర్టు - భావద్ కేసును మాత్రం హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే ఈ విషయంలో సరైన సాక్షాలు లేవని సల్మాన్ ను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసు తీర్పు అనంతరం రకరకాల కామెంట్స్ వినిపించాయి. అయితే తాజాగా ఆ కేసులో తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ, హైకోర్టు తీర్పును సవాల్ చేసిన రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కండల వీరుడికి కృష్ణజింకల కష్టాలు ఇప్పట్లో తప్పేలా లేవని కామెంట్స్ వినిపిస్తున్నాయి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/