Begin typing your search above and press return to search.
స్టూడెంట్ నెం.1 సమయంలోనే రాజమౌళి బాహుబలి సీన్స్ చెప్పేవాడు
By: Tupaki Desk | 22 Nov 2020 12:30 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి కెరీర్ ఆరంభం నుండి రాజీవ్ కనకాల ఆయనకు సన్నిహితుడిగా ఉన్నాడు. స్టూడెంట్ నెం.1 సినిమాలో రాజీవ్ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. అప్పటి నుండి రాజమౌళి.. ఎన్టీఆర్ మరియు రాజీవ్ కనకాల లు సన్నిహితులుగా కొనసాగుతున్నారు. ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానెల్ కు రాజీవ్ కనకాల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్బంగా పలు విషయాలను తెలియజేశాడు. సుమతో వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చిన ఆయన తన సినీ కెరీర్ మరియు పిల్లల విషయమై పలు విషయాలపై స్పందించడం జరిగింది.
రాజమౌళి గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ స్టూడెంట్ నెం.1 సినిమా చేస్తున్న సమయంలోనే అప్పుడప్పుడు భారీ యాక్షన్ సన్నివేశాలు గ్రాఫిక్స్ సంబంధించిన విషయాలను వివరించే వాడు. అప్పుడు నాకు చెప్పిన చాలా సీన్స్ బాహుబలిలో చూపించాడు. 20 ఏళ్ల నుండి ఆయన మనసులో నాటుకుని ఉన్న సీన్స్ ను బాహుబలిలో అద్బుతంగా ప్రజెంట్ చేశాడంటూ రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు. చాలా కాలం క్రితం నుండి బాహుబలి కథ రాజమౌళి మరియు ఆయన తండ్రి మద్య చర్చ జరుగుతూ వచ్చిందని రాజీవ్ కనకాల మాటలతో క్లారిటీ వచ్చింది.
అన్ని సంవత్సరాల సంఘర్షణ కనుక బాహుబలి ఇండియాస్ బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా నిలిచిందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఆ సినిమా మరెన్ని రికార్డులను సృష్టిస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్.. రామ్ చరణ్ వంటి స్టాన్స్ ను నటింపజేయడం వల్ల ఈ సినిమా స్థాయి మరింతగా పెరిగింది. వచ్చే ఏడాది రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో రీచ్ అవుతుందో చూడాలి.