Begin typing your search above and press return to search.
నాకు అందుకే అవకాశాలు రావట్లేదు: రాజీవ్
By: Tupaki Desk | 24 Nov 2017 3:24 PM GMTటాలీవుడ్ లో ప్రతిభావంతులైన నటులలో రాజీవ్ కనకాల ఒకరు. మొదట చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన రాజీవ్ ఆ తర్వాత మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, రాజీవ్ ప్రతిభకు తగ్గ పాత్రలు, ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదనే వాదన ఇండస్ట్రీలో ఉంది. తాజాగా, ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ ఆ విషయంపై స్పందించారు. తనకు అవకాశాలు రాకపోవడానికి తనే ధోరణే కారణమని చెప్పారు. తాను ప్రొఫెషనల్ గా ఉండడం వల్లే ఎక్కువ అవకాశాలు రాలేదన్నారు.
తాను ఇండస్ట్రీలోని పరిచయస్థులకు ప్రతిరోజూ ఫోన్ చేసి ఎలా వున్నారు? .. ఏం చేస్తున్నారు? అంటూ టచ్ లో ఉండనని రాజీవ్ అన్నారు. తనకు అవకాశాలు రాకపోవడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చన్నారు. అది ఒకరకంగా తనలోని లోపమనుకోవచ్చని అన్నారు. అయితే, తాను ఫ్రెండ్స్ అందరినీ కలుస్తానని, సరదాగా గడుపుతానన్నారు. కానీ, ఆ సమయంలో సినిమాల గురించి మాట్లాడనని, స్నేహాన్ని .. ప్రొఫెషన్ ను వేరు వేరుగానే చూస్తానని చెప్పారు. తనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడానికి కారణమిదేనని చాలాకాలం క్రితమే గ్రహించానన్నారు. కానీ, ఒక్కసారిగా మారిపోయి ఆత్మను చంపుకోవడం ఇష్టం లేక, ఇంతకాలం నడిపాం.... ఇంకొంతకాలం నడిపించలేమా అనుకుంటానని తన మనసులోమాట వెల్లడించారు.