Begin typing your search above and press return to search.
ఆర్ సి 12 ఓవర్సీస్ కొనేసిన కనకాల
By: Tupaki Desk | 30 Sep 2018 5:27 AM GMTరామ్‌చరణ్ - బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆర్‌సి 12 ప్రస్తుతం ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. `స్టేట్ రౌడీ` అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని వార్తలొచ్చాయి. త్వరలోనే టైటిల్ లాంచ్ కి యూనిట్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం అజర్ భైజాన్ (యూరప్)లోని అరుదైన లొకేషన్లలో భారీ యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని ఈ సోమవారం హైదరాబాద్ కి టీమ్ రిటర్న్ అవుతోంది.
`రంగస్థలం` సక్సెస్ తో రామ్ చరణ్ హవా ఓవర్సీస్ లోనూ మొదలైంది. ఆ సినిమాలో గోదారి కుర్రాడిగా - చెవిటివానిగా చరణ్ నటన అమెరికా ఆడియెన్‌కి పిచ్చిగా నచ్చేసింది. ఆ క్రమంలోనే రంగస్థలం బాక్సాఫీస్ వద్ద సుమారు 24కోట్లు (3.5 మిలియన్ డాలర్లు పైగా) వసూలు చేసింది. అందుకే ఇప్పుడు ఆర్ సి 12 అమెరికా హక్కులకు భారీగా పోటీ నెలకొందని తెలుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీరిలీజ్ బిజినెస్ స్పీడ్ గానే ఉందన్న మాటా వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. అమెరికా రిలీజ్ హక్కుల్ని రాజీవ్ కనకాల - నటుడు మహర్షి బృందం కొందరు బ్రిటన్ ఎన్నారైలను కలుపుకుని ఛేజిక్కించుకున్నారని తెలుస్తోంది. ఆర్ సి 12 అమెరికా డీల్ దాదాపు 12-15 కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉందింకా.
అమెరికా హక్కులు ఛేజిక్కించుకున్న రాజీవ్ కనకాల దశాబ్ధాలుగా టాలీవుడ్ - శాండల్ వుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే, బుల్లితెర షోల నిర్మాతగా కొనసాగుతున్నారు. టీవీ సీరియళ్లు సహా కొన్ని లఘు చిత్రాల్లోనూ నటిస్తున్నారు. మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గా రాణించేందుకు చరణ్ లాంటి అగ్రహీరో సినిమాతో ఆరంగేట్రాన్ని ప్లాన్ చేశారని తెలుస్తోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.