Begin typing your search above and press return to search.

మా అధ్యక్షుడు.. ఫ్రమ్‌ లండన్‌

By:  Tupaki Desk   |   20 July 2015 8:50 AM GMT
మా అధ్యక్షుడు.. ఫ్రమ్‌ లండన్‌
X
ఆన్‌సెట్స్‌ పుట్టినరోజు వేడుకలు రెగ్యులర్‌ గా చూసేవే. అప్పుడే వెండితెరకి పరిచయం అవుతున్న కథానాయకుడు, కథానాయిక నుంచి ప్రతి ఒక్కరికీ ఆన్‌సెట్స్‌ పుట్టినరోజు వేడుకలు జరుపుకునే ఆనవాయితీ ఉంది. అయితే ఈసారి ఈ పుట్టినరోజు వేడుకకు ఓ ప్రత్యేకత ఉంది.

ప్రస్తుత మా అసోసియేషన్‌ అధ్యక్షుడు, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ ఆన్‌సెట్స్‌ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. షూటు, బూటు వేసుకుని లండన్‌ బాబులా లండన్‌ అదిరేలా ఈ పుట్టినరోజు వేడుక జరిగింది. అన్నట్టు అసలు విషయం చెప్పలేదు కదూ. రాజేంద్ర ప్రసాద్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరో గా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్‌ కి తండ్రి పాత్ర లో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగు లో బిజీగా ఉన్నారు. అక్కడే ఈ ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారన్నమాట. ఎన్టీఆర్‌, సుకుమార్‌, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ తదితరులు రాజేంద్రునికి పుట్టినరోజు కేక్‌ తినిపించి శుభాకాంక్షలు చెబుతున్నప్పటి దృశ్యమిది.

ఇక్కడో సంగతి గుర్తు చేసుకోవడం సందర్భోచితం. అసలు రాజేంద్రప్రసాద్‌ ముఖానికి రంగేసుకుని ఇంత పెద్ద స్టార్‌ అవ్వడం వెనక నటసార్వభౌమ సీనియర్‌ ఎన్టీఆర్‌ ప్రోత్సాహం మర్చిపోలేనిది. ఆ సంగతిని పలు సందర్భాల్లో రాజేంద్రుడే స్వయంగా చెప్పారు. ఈ విధంగా ఇప్పుడు జూ.ఎన్టీఆర్‌ తో రాజేంద్రుడు జత కట్టడం చూస్తే ముచ్చటేస్తోంది.