Begin typing your search above and press return to search.

ఈ మోడీ ఆ మోడీ కి సంబంధం ఉందా?

By:  Tupaki Desk   |   30 Sep 2019 12:47 PM GMT
ఈ మోడీ ఆ మోడీ కి సంబంధం ఉందా?
X
'డ్రీమ్‌' చిత్రంతో పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పురస్కారాలు దక్కించుకున్న భవానీ శంకర్‌ ప్రస్తుతం 'క్లైమాక్స్‌' అనే విభిన్న చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌తో పాటు శివ శంకర్‌ మాస్టర్‌.. సాషా సింగ్‌.. రమేష్‌ ఇంకా చందులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈచిత్రం చాలా విభిన్నంగా ఉండబోతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అతి తక్కువ పాత్రలతో.. ప్రతి పాత్ర హీరోగా ఉండే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతుందట.

ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌ పాత్ర పేరు మోడీ. ఇప్పటి వరకు ఎన్నో విభిన్న పాత్రలు పోషించి మెప్పించిన నటకిరీటి లుక్‌ చాలా విభిన్నంగా ఉండబోతుంది. రాజేంద్ర ప్రసాద్‌ లుక్‌ రివీల్‌ చేయడంతో పాటు ఆయన పాత్ర పేరు మోడీ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. త్వరలో రామోజీ ఫిల్మ్‌ సిటీలో పాట చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌ గారి పాత్రకు మోడీ పేరు చాలా ఆప్ట్‌ గా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటారు. ఆయన పాత్ర గురించి ఇప్పుడే ఏం చెప్పలేను.. కాని సినిమాకు ఆయన పాత్ర తప్పకుండా హైలైట్‌ అవుతుందని భవానీ శంకర్‌ పేర్కొన్నాడు.రాజేంద్ర ప్రసాద్ పోషిస్తున్న మోడీ పాత్రకు ప్రధాని మోడీ కి ఏమైనా లింక్ ఉంటుందా అనేది చూడాలి.