Begin typing your search above and press return to search.
ఇంత జరుగుతుంటే రాజేంద్రుడు ఏమయ్యాడో?
By: Tupaki Desk | 27 April 2018 8:26 AM GMTటాలీవుడ్ లో నెలకొన్న తాజా వివాదం చిలికి చిలికి గాలివాన అయింది. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ లో కాసిన్ని ఘాటు పదాలను శ్రీరెడ్డి వాడేయడం గమనించిన న్యూస్ ఛానల్స్.. వరుసగా ఆమెతో లైవ్ షోలు పెట్టేశాయి. కెమేరా ముందు విచ్చలవిడిగా బూతులు వాడేయడాన్ని తెగ ఎంకరేజ్ చేశాయి.
ఆ తర్వాత అర్ధ నగ్న ప్రదర్శనకు దిగడం.. మా అసోసియేషన్ మీద చెలరేగిపోవడం.. ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ ను పచ్చిబూతు మాటతో తిట్టడం జరిగిపోయాయి. ఇక పవన్ రంగ ప్రవేశం చేసిన తర్వాత సంగతి తెలిసిందే. ఇంత జరుగుతుంటే.. దాదాపుగా ఇండస్ట్రీలో ప్రధానమైన వ్యక్తులు అందరూ బయటకు వచ్చారు. చివరకు మా అసోసియేషన్ కు ఒకప్పుడు అధ్యక్షుడు అయిన మురళీ మోహన్ కూడా స్పందించారు. కానీ మెగా ఫ్యామిలీ తాను ఎంతో దగ్గర అని ఓ సందర్భంలో చెప్పుకున్న మా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాత్రం అస్సలు కనిపించడం లేదు. ఒక్కటంటే ఒక్క సందర్భంలో కూడా రాజేంద్రుడి ప్రస్తావన రాలేదు.
ఎవరూ ఆయన గురించి టాపిక్ తీసుకురాలేదు. ఆయన కూడా తన బాధ్యతగా ఒక మాటను కూడా మీడియాకు ఇవ్వలేదు. సమస్యలపై చురుగ్గానే స్పందించడం రాజేంద్రుడికి అలవాటు. కానీ ఈ విషయంలో ఈయన ఇంత సైలెంట్ గా ఎందుకు ఉండిపోయాడో మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు.