Begin typing your search above and press return to search.

మహేష్‌, బన్నీ సూపరంటున్న సీనియర్‌

By:  Tupaki Desk   |   18 March 2015 3:30 PM GMT
మహేష్‌, బన్నీ సూపరంటున్న సీనియర్‌
X
ఒకప్పుడు మీడియం రేంజి హీరోలుగా ఉన్న సీనియర్లందరూ క్యారెక్టర్‌ ఆర్టిస్టులైపోతున్న ట్రెండు ఇది. ఈ ట్రెండును రాజేంద్ర ప్రసాద్‌ చాలా ముందుగానే అందిపుచ్చుకున్నారు. ఐతే మొగుడు, నిప్పు, బావ లాంటి సినిమాలు అట్టర్‌ ఫ్లాపై ఆయనకు 'ఐరెన్‌ లెగ్‌' ముద్రను తెచ్చిపెట్టాయి. ఐతే 'జులాయి' ఆయన కెరీర్‌ను కొత్త మలుపు తిప్పింది. దీంతో వరుసగా పెద్ద పెద్ద సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రోల్స్‌ చేసే అవకాశం దక్కించుకున్నాడు నట కిరీటి. బన్నీతో మరోసారి కలిసి చేసిన 'సన్నాఫ్‌ సత్యమూర్తి' విడుదలకు రెడీ అవుతుండగా.. ప్రిన్స్‌ మహేష్‌ బాబుతో కొరటాల శివ చేస్తున్న సినిమాలోనూ ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు రాజేంద్ర ప్రసాద్‌.

ఈ అనుభవం గురించి ఆయన మాట్లాడుతూ.. ''సాధారణంగా ఈ వయసులో రిటైర్మెంట్‌ గురించి ఆలోచించాలి. కానీ ఇప్పుడే నాకు మంచి మంచి పాత్రలు చేసే అవకాశం లభిస్తోంది. అందుకే నా శరీరానికి నేను సమాధానం చెప్పుకుంటున్నా. 'కమాన్‌.. మనకు మంచి అవకాశం' అని నన్ను నేను ప్రోత్సహించుకుంటున్నా. ఒకప్పుడు హీరోగా ఏడాదికి 15 సినిమాలు చేశా. రేయింబవళ్లు కష్టపడ్డా. అవన్నీ ఓ ఎత్తు. ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్లు మరో ఎత్తు. ఈ తరం హీరోల్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. మహేష్‌బాబు, బన్నీ లాంటి హీరోలు తమ కెరీర్‌ను నడిపించుకుంటున్న తీరు ఆట్టుకుంటోంది. సెట్లో భలే హుషారుగా ఉంటారు వీళ్లు. మహేష్‌ ఎంత నవ్విస్తాడంటే.. అతడికి ఎవరైనా వాళ్లు ఔట్‌. బన్నీ గురువుగారూ అంటూ ఆప్యాయంగా పిలుస్తాడు. నేను ఒకప్పుడు నా క్యారెక్టర్‌ సంగతి నేను చూసుకుని వెళ్లిపోయేవాణ్ని. కానీ వీళ్లు అలా కాదు. ప్రతి విభాగంపైన శ్రద్ధ చూపిస్తున్నారు. మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నేనింత బరువు మోసేవాణ్ని కాను'' అన్నారు.