Begin typing your search above and press return to search.
సామ్ నిర్మొహమాటంపై రాజేంద్రుని పంచ్!
By: Tupaki Desk | 4 July 2019 4:53 AM GMTథియేటర్ ఆర్ట్స్ లో అథెంటిక్ గా స్టడీ చేసి వచ్చిన మెచ్యూర్డ్ పెర్ఫామర్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ పనితనంపై ఎలాంటి సందిగ్ధత లేదు. నాలుగు దశాబ్ధాల అనుభవం ఆయన సొంతం. అంతటి సీనియర్ నటుడు ఓ యువకథానాయిక పెర్ఫామెన్స్ కి ఇచ్చిన ప్రశంస మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సమంత- లక్ష్మి - రాజేంద్రప్రసాద్, నాగశౌర్య కీలక పాత్రల్లో నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఓ బేబి ఈ శుక్రవారం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ఆయన మీడియాతో ముచ్చటిస్తూ .. తన పాత్ర గురించి.. సమంత నట ప్రతిభ గురించి ఆసక్తికర సంగతుల్ని వెల్లడించారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ``ఓ బేబీ కథ- స్క్రీన్ ప్లేలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బేబీకి బోయ్‌ఫ్రెండ్ గా నటించాను. మిలిటరీ నుంచి రిటైర్ అయిన నేను- లక్ష్మి కలిసి ఓ హోటల్ నడుపుతుంటాం. తను నన్ను చంటి అని పిలుస్తుంటుంది. ఉన్నట్టుండి ఒక రోజు తను కనిపించదు. ఆ స్థానంలో సమంత వచ్చి ఉంటుంది. తను కూడా నన్ను చంటి అని పిలుస్తుంటుంది.. ఆ తర్వాత ఏమైందో తెరపైనే చూడాలి`` అంటూ కథని రివీల్ చేశారు. లక్ష్మి.. సామ్ ఇద్దరికీ నేను బోయ్ ఫ్రెండ్ గా నటించానని తెలిపారు. ``ఇదివరకూ `బామ్మ బాట బంగారు బాట`లో భానుమతిగారితో, `బృందావనం`లో అంజలీదేవిగారితో నటించాను. ఇప్పుడు లక్ష్మిగారితో పెయిర్ గా నటించడం ఎగ్జయిట్ చేసింది. జీవితాన్ని సినిమాగా చూపించే ఛాన్స్ చాలా అరుదు. ఓ బేబితో అది సాధ్యమైంది. కొరియన్ చిత్రం `మిస్ గ్రానీ`ని తీసుకుని నందిని రెడ్డి తెలుగుకు తగ్గట్టు చాలా బాగా తీశారు. డైరెక్టర్ నందిని నన్ను కలవగానే చంటి పాత్రకు మీరు తప్ప ఇంకెవరూ సరిపోరని ఎంపిక చేసుకుంది`` అని తెలిపారు.
సమంత గురించి రాజేంద్ర ప్రసాద్ పలు ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేశారు. ``ఆన్ లొకేషన్ సమంత నిర్మొహమాటంగా హాస్యానికి సంబంధించి నన్ను అడిగి చేసేది. చాలా చనువుగా ప్రతిదీ అడిగి నేర్చుకునేది`` అని తెలిపారు. 4-5 సన్నివేశాల్లో సమంత నటనను చూసి ఎంతో ఎగ్జయిట్ అయ్యాను. ఓ సీన్ లో తను నన్ను జుట్టు పీకి కొడుతుంది. చాలా బోల్డ్ గా బాగా నటించింది. మా మధ్య కెమిస్ట్రీ అంతే చక్కగా కుదిరింది`` అని తెలిపారు. వృత్తిపరమైన సంతృప్తినిచ్చిన పాత్రలో నటించానని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు.