Begin typing your search above and press return to search.
డ్రగ్స్‌పై రాజేంద్రుడు ఏమన్నాడో వినండి
By: Tupaki Desk | 14 July 2017 7:53 AM GMTటాలీవుడ్ లో ఎక్కడ చూసినా డ్రగ్స్ గురించే చర్చ. ఏ ఇద్దరు కలిసినా లిస్టు అదేనా? ఇంకే పెరిగే అవకాశముందా? అంటూ అదేదో సినిమా కలెక్షన్ల విషయంలాగా మాట్లాడుకుంటున్నారు. లిస్టులో ఉన్నవాళ్లు వీళ్లే అంటూ మీడియా డైరెక్టుగా పేర్లు చెప్పేస్తోంది. మరోపక్క `ఆ లిస్టులో ఉన్న తారలేమో మాక అసలు డ్రగ్స్ తో సంబంధమే లేదు, నోటీసులు కూడా ఏమీ రాలేదు`` అని ఆన్ లైన్ లో చెప్పేస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళుతుందో, ఎన్ని రోజులు సాగుతుందో చూడాలి.
అయితే సినిమా పరిశ్రమలోని పెద్దలు మాత్రం ఇది మాయని మచ్చ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా తరంలో ఇలాంటి అలవాట్లు ఎవ్వరికీ ఉండేవి కావు అంటున్నారు. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ డ్రగ్స్ గురించి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ``సినిమావాళ్లు వినోదం పంచి ప్రేక్షకులకి మత్తెక్కించాలి కానీ... మత్తు మందులు వాడటం ఏం పద్ధతి?`` అని హితవు పలికారు. ``సినిమా పరిశ్రమలో చాలామంది డ్రగ్స్ వాడుతున్న విషయం వాస్తవమే. అయితే సక్సెస్ లు అందుకోలేక వాటికి బానిసలైనట్టు తెలుస్తోంది. అది మంచి పద్ధతి కానే కాదు. ఇకపై ఇలాంటి వాటికి దూరంగా ఉండటం చాలా అవసరం. మా తరం హీరోలు కానీ, నటులు కానీ ఎవ్వరూ ఇలా బానిసలవ్వలేదు`` అన్నారు. రాజేంద్రుడి మాట విని ఇకపై ప్రేక్షకులకు వినోదంతో మత్తెక్కించడంపై యువతరం తారలు దృష్టిపెట్టాలని కోరుకొందాం.