Begin typing your search above and press return to search.

నాకు ఆయన పెట్టిన భిక్ష ఇది: రాజేంద్రప్రసాద్

By:  Tupaki Desk   |   28 May 2022 1:47 PM GMT
నాకు ఆయన పెట్టిన భిక్ష ఇది: రాజేంద్రప్రసాద్
X
తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతగానో గుర్తింపును అందుకున్న నందమూరి తారక రామారావు కేవలం సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా మంచి నాయకుడిగా గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. అయితే నేడు ఆయన జయంతి సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అంతేకాకుండా సినీ ప్రముఖులు ప్రత్యేకంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్లి ఆయనను స్మరించుకున్నారు.

ఇక నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూడా ఎన్టీఆర్ చేసిన గొప్పతనాన్ని అలాగే ఆయన తన జీవితానికి ఉపయోగపడిన విధానాన్ని కూడా ఆయన చాలా ఎమోషనల్ గా అభివర్ణించారు.. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు ముఖ్య కారణం శ్రీ నందమూరి తారక రామారావు గారు.

నేను నటి జీవితం లోకి రావాలని అనుకున్నప్పుడు ఆయన నాకు అండగా నిలిచారు. ఆయన ద్వారా నేను మద్రాస్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో నటుడిగా శిక్షణ తీసుకున్నాను. ఆ తరువాత ఆయన అండతోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాను.

ఆయన మేలు నేను ఎప్పటికీ మరువలేను. ఈ నట జీవితం ఆయన పెట్టిన భిక్ష అని భావిస్తాను. ఆయన నాకు ఒక ప్రత్యేకమైన దేవుడు అని కూడా నేను అనుకుంటాను. నేడు నందమూరి తారకరామారావు 100 వ జయంతి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుగు వారందరూ కూడా ప్రత్యేకంగా అన్నగారిని గుర్తు చేసుకుంటున్నారు. అంతే కాకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాకు కూడా చాలా దేశాల నుంచే ఈ 100 వ జయంతి ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలని తనను రమ్మని కూడా తెలియజేశారు.

దేశంలో నందమూరి అభిమానులు ఎక్కడ ఉన్నా కూడా వారందరూ కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

నందమూరి తారక రామారావు గారు ఒక మంచి నటుడు మాత్రమే కాదు ఒక మంచి రాజకీయ నాయకుడు. ఆయన మన తెలుగువాడు అవ్వడం మనకు ఎంతో గర్వకారణం. రాజకీయాల్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆయన సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే అన్నారు.. అని రాజేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు.