Begin typing your search above and press return to search.
అవార్డులిచ్చేస్తున్నోళ్లను ఏకేశాడు
By: Tupaki Desk | 31 Oct 2015 1:30 PM GMTకొన్ని రోజుల నుంచి మోడీ సర్కారు నిర్ణయాలకు వ్యతిరేకంగా సాహితీ వేత్తలు - సినీ ప్రముఖులు తాము అందుకున్న జాతీయ అవార్డుల్ని వెనక్కి ఇచ్చేస్తున్న సంగతి తెలిసిందే. సాహితీ వేత్తల నిరసనకు కొంచెం పెద్ద కారణాలే ఉన్నాయి కానీ.. సినీ ప్రముఖులు అవార్డులిచ్చేయడానికి కారణం చిన్నదే. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్.టి.ఐ.ఐ)లో కొన్ని నియామకాల్ని నిరసిస్తూ అక్కడి విద్యార్థులు నాలుగు నెలల కిందట సమ్మెకు దిగారు. మొదట్లో దీన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ.. సాహితీ వేత్తలపై దాడులకు నిరసనగా దేశంలోని చాలామంది కవులు - రచయితలు అవార్డులు వెనక్కిచ్చేయడం చూసి.. అదే స్టయిల్ ఫాలో అయిపోయారు సినిమా వాళ్లు.
తాము అందుకున్న జాతీయ అవార్డుల్ని వెనక్కిచ్చేయడం మొదలుపెట్టారు. ఐతే దీనికి మద్దతుగా మాట్లాడేవారి కంటే విమర్శించే వాళ్లే ఎక్కువున్నారు. ఎఫ్టీఐఐకి సంబంధించిన వివాదం చిన్నదని.. దానికి ఇంత తీవ్రంగా ప్రవర్తించడం సరికాదని అంటున్నారు. జాతీయ అవార్డులతో పాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకున్న రాజేష్ టచ్రీవర్ అయితే.. అవార్డులు వెనక్కిస్తున్న వారి గాలి తీసేశాడు. ‘‘మీకిచ్చిన అవార్డులు ప్రభుత్వం తనకు తానుగా ఇచ్చింది కాదు. మీరు దరఖాస్తు చేసుకుంటే, అవార్డు ఇవ్వమంటే సరే అని ఇచ్చింది. అలాంటి అవార్డుల్ని మీరు తిరిగివ్వడంలో ఏం ఔచిత్యం ఉంది. అవార్డులు వెనక్కివ్వడం ద్వారా మీకేమైనా నష్టం జరుగుతోందా? డబ్బులేమైనా వెనక్కిస్తున్నారా? మీరు అవార్డులు వెనక్కిచ్చినంత మాత్రాన మీకు ఇంతకుముందు దక్కిన గౌరవం వెనక్కి వెళ్లిపోతుందా? అవార్డులు వెనక్కివ్వడమన్నది మీకు ఏ రకంగానూ నష్టం చేయని ప్రక్రియ. అందుకే ఏదో తమాషాలాగా ఈ పని చేస్తున్నారు’’ అంటూ విరుచుకుపడ్డాడు రాజేష్. అతడి వాదన అర్థవంతంగానే ఉంది కదూ!