Begin typing your search above and press return to search.
RAJINI 168 బర్త్ డేకి ఒక రోజు ముందే
By: Tupaki Desk | 12 Dec 2019 4:52 AM GMTపుట్టిన రోజు పేరు తో స్టార్ల హంగామా తెలిసిందే. అభిమాన సంఘాలు బోలెడంత హడావుడి చేసేస్తుంటాయి. అయితే అలాంటి వాటికి తాను దూరంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. గత కొన్నేళ్లుగా ఆయన బర్త్ డే వేడుకలకు దూరంగా ఎంతో నిరాడంబరంగా ఉంటున్నారు. ఇటీవల హిమాలయాల పర్యటనకు వెళ్లిన రజనీ ధార్మిక జీవనాన్ని సాగిస్తున్నారు. నేడు (12 డిసెంబర్) రజనీ పుట్టినరోజు. అయినా ఆయన ఈ వేడుకలను నిషేధించారు. అభిమానుల్ని కేవలం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటే చాలని కోరారు.
రజనీకాంత్ పుట్టినరోజు సందర్భం గా ఈ గురువారం కొత్త సినిమాని ప్రారంభించారు. దరువు శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీగా నిర్మిస్తోంది. రజనీకాంత్- కీర్తి సురేష్ జంటగా ఈ చిత్రం తెరకెక్కనుంది. సూపర్ స్టార్ కెరీర్ 168వ సినిమా ఇది. కొంత గ్యాప్ తర్వాత ముత్తు ఫేం మీనా ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తుండడం ఆసక్తికరం. ఖుష్బూ- ప్రకాష్ రాజ్- సూరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. నిన్న(బుధవారం) ఏమంత హడావుడి లేకుండా సైలెంటుగా పూజా కార్యక్రమం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి రజనీకాంత్- మీనా- ఖుష్బూ- దర్శకుడు శివ- నిర్మాతలు హాజరయ్యారు.
వయసు 70కి చేరువైనా రజనీలో జోరు మాత్రం తగ్గలేదు. శివాజీ రావు గైక్వాడ్ అనే ఒక సాధారణ కండక్టర్ మహారాష్ట్ర లో పుట్టి మద్రాసుకు వెళ్లి.. తమిళ సినీపరిశ్రమలో ప్రవేశించారు. 1973లో నటనలో డిప్లొమా సాధించి.. కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అపూర్వ రాగాంగల్ (1975) అనే చిత్రంలో నటించారు. అనంతరం రజనీకాంత్ గా మారి దేశం గర్వించదగ్గ స్టార్ అయ్యారు. తమిళం-తెలుగులో పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో రజనీకాంత్ నటించారు. మెజారిటీ పార్ట్ ఆయన చిత్రాలు ద్విభాషా చిత్రాలుగానే రిలీజై విజయం అందుకున్నాయి.