Begin typing your search above and press return to search.

త‌లైవాతో త‌మాషానా .. ఏజ్ గేజ్ ఏవీ ఆయ‌న్ని ఆప‌లేవ్!

By:  Tupaki Desk   |   14 Dec 2020 5:45 AM GMT
త‌లైవాతో త‌మాషానా .. ఏజ్ గేజ్ ఏవీ ఆయ‌న్ని ఆప‌లేవ్!
X
త‌లైవా ర‌జ‌నీకాంత్ రాజ‌కీయారంగేట్రం స‌ర్వ‌త్రా వేడి పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. జాతీయ స్థాయిలో ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. చాలా విమ‌ర్శ‌ల త‌ర్వాత తాను లేటుగా వ‌స్తున్నా లేటెస్టుగా బ‌రిలో దిగుతున్నారా? త‌మిళ రాజ‌కీయాల్లో పెను ప్ర‌కంప‌నాలకు ర‌జ‌నీ తెర తీయ‌బోతున్నారా? అన్న ఆస‌క్తి జ‌నాల్లో నెల‌కొంది.

నిన్న పుట్టినరోజు వేడుకల తర్వాత సూపర్ స్టార్ ఫ్లైట్ దిగి వెళుతుంటే జ‌నం క్యూ క‌ట్టారు. ఆయ‌న‌తో ఫోటోలు దిగేందుకు పోటీ ప‌డ్డారు. ఈ పుట్టినరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ కు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం గురించి ఆయన తీసుకున్న నిర్ణయం సంచ‌ల‌నంగా మారింది. దీనికోసమే అతని అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. రాజకీయ పరిశీలకులందరి కళ్ళు ర‌జ‌నీ వైపే ఉన్నాయి.

అయితే త‌లైవా పూర్తిగా రాజకీయాల్లోకి దూకాల‌ని భావిస్తే.. దానికి ముందు రజినీ తన సినిమా క‌మిట్ మెంట్ల‌ను పూర్తి చేయాలి. డిసెంబర్ 12 న తన పుట్టినరోజు తర్వాత సూపర్ స్టార్ ‘అన్నాథే’ షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. దీనికోసం డిసెంబర్ 13 న హైదరాబాద్ కి విమానంలో ప్ర‌యాణించారు. త‌న రాజకీయ ఎజెండాపై తన నిర్ణయాన్ని ప్రకటించే ముందు సూపర్ స్టార్ ‘అన్నాథే’ పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నిబద్ధత లో ఆయ‌న‌ను కొట్టేవాళ్లే లేరు. తాను త‌ల‌పెట్టిన‌ది ఏది అయినా క‌మిట్ మెంట్ విష‌యంలో ఆయ‌న‌కు ఎదురే లేదు.

అన్నాథే ర‌జ‌నీ రాజకీయ నిర్ణయానికి ముందు త‌న‌ చివరి చిత్రంగా భావిస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ ని త్వ‌ర‌గా ముగించి త‌దుప‌రి పెండింగ్ షూట్ ని పూర్తి చేసేయాల‌న్న‌ది ర‌జ‌నీ ప్లాన్. డిసెంబ‌ర్ 30న రాజకీయ పార్టీని ప్రారంభించి అటుపై స్పీడ్ అంటే ఏంటో చూపించాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్నార‌ని గుసగుస‌లు వినిపిస్తున్నాయి.

అయితే 70ఏళ్ల ర‌జ‌నీ ఈ ఏజ్ లో రాజకీయాల్లో ఏమేర‌కు రాణిస్తారు? అన్న‌దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. అస‌లు వ‌య‌సుతో ప‌నే లేదు. షూటింగుల‌కు కానీ రాజ‌కీయాల‌కు కానీ ఏజ్ తో ప‌నే లేద‌ని నిరూపించే త‌ప‌న ర‌జ‌నీలో క‌నిపిస్తోంది. అన్నాథే పూర్తి చేస్తారు. అటుపై రాజ‌కీయ పార్టీని ప్రారంభించి తానేంటో చూపించేందుకు ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గే ఆలోచ‌నే ఆయ‌న‌లో క‌నిపించ‌డం లేద‌న్న‌ది అభిమానులు చెబుతున్న మాట‌. త‌లైవాతో త‌మాషానా .. ఆయ‌న‌ ఇస్ట‌యిలే వేరు..! అంటూ అభిమానులు సంబ‌రాల్లో మునిగి తేలుతున్నారు. ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో ర‌జ‌నీ-ఖుష్బూ జంట‌పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ కోసం ఖుష్బూ ఎంతో స్లిమ్ గా మారిపోవ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.