Begin typing your search above and press return to search.
గేర్ మార్చిన రజనీ .. జెట్ స్పీడ్ షురూ!
By: Tupaki Desk | 12 Jan 2021 8:19 AM GMTతమిళనాట రజనీకాంత్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఆయన ఒక భాషలో ఒక సినిమా చేస్తున్నాడూ అంటే, దాదాపు ఓ అరడజను భాషల్లో ఏక కాలంలో సినిమా చేస్తున్నట్టుగానే అనుకోవాలి. ఎందుకంటే ఆయన చేసే ఆ ఒక్క సినిమా మిగతా భాషల్లోను విడుదలవుతుంది .. విజయవిహారం చేస్తుంది. రజనీకి తమిళనాడులో ఎంతటి మార్కెట్ ఉందో, మిగతా ప్రాంతాల్లోను కాస్తంత అటూ ఇటుగా అంతే మార్కెట్ ఉంది. అందువలన ఆయన సినిమాలు తీయడంలోను పోటీ ఉంటుంది .. ఆ సినిమాలను కొనడంలోను పోటీ ఉంటుంది. ఇక ఆ సినిమాలను చూడటంలో పోటీ ఎలాగూ ఉంటుంది.
ఇతర హీరోలు తెరపై చేసే కొన్ని విన్యాసాలు చూస్తే అతిగా అనిపిస్తాయి. అదే రజనీ చేస్తే ప్రేక్షకులు వాటిని అంగీకరిస్తారు. అందుకు కారణం .. అవి ఆయన స్టైల్ కి లింకై ఉండటమే. అలాంటి రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన సినిమాలవైపు వస్తారో .. లేదోననే ఉద్దేశంతో, ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు పోటీపడ్డారు. అందువల్లనే ఆయన నుంచి కొత్త దర్శకుల సినిమాలు కూడా వచ్చాయి. రజనీ మార్కుతోనే భారీ వసూళ్లను సాధించాయి .. కొత్త రికార్డులను సృష్టించాయి.
అలాంటి రజనీకాంత్ .. ఇక రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఇటీవల స్పష్టం చేశారు. ఇకపై సినిమాలపైనే తన పూర్తి దృష్టి పెట్టనున్నారు. ఇప్పుడు కూడా దర్శక నిర్మాతల మధ్య మళ్లీ పోటీ మొదలైంది. ఆయనతో సినిమాలు చేయడానికి వాళ్లంతా ఉత్సాహ పడిపోతున్నారు. రజనీకాంత్ కి సూపర్ హిట్లు ఇచ్చిన సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ .. 'చంద్రముఖి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పి.వాసు మొదలు, 'కబాలి' దర్శకుడు పా.రంజిత్, .. 'పేట' డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ .. వీళ్లంతా కూడా రజనీకి కొత్త కథలు వినిపిస్తున్నారనేది కోలీవుడ్ టాక్. ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' చేస్తున్న రజనీకాంత్, ఆ తరువాత ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి మరి.