Begin typing your search above and press return to search.
అర్థశతకానికి రజనీ ఇంకెంతో దూరంలో లేరు
By: Tupaki Desk | 11 Aug 2020 10:50 AM GMTభారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుని మరో నూతనశకం వైపు అడుగులు వేస్తోంది. ఇన్నేళ్లలో సౌత్ సినిమా దాదాపు 80ఏళ్లుగా మనుగడ సాగిస్తోంది. ఇక సౌత్ సినిమాకి ఎనలేని ఖ్యాతిని తెచ్చిన ది గ్రేట్ రజనీకాంత్ కెరీర్ 45 ఏళ్లు పూర్తవ్వడం ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన తలైవాగా కీర్తినందుకుని సూపర్ స్టార్ గా వెలుగులు విరజిమ్ముతూనే ఉన్నారు. అర్థశతకం కొట్టేందుకు ఇంకెంతో దూరంలో లేరు.
భారతీయ సినిమా పరిపాలకుడిగా నియమితుడై 45 సంవత్సరాలు అయిన సందర్భంగా # 45YearsOfRajinismCDP సెలబ్రేషన్స్ తో హోరెత్తిపోతోంది. ఈ సందర్భంగా దేశవిదేశాల్లోని అభిమానులు.. రజనీ అనుచరులు ఆయన కెరీర్ కి సంబంధించిన ఫోటోలు.. వీడియోలను సోషల్ మీడియా వేదికలపై పంచుకుంటున్నారు. మోహన్‌లాల్ - పృథ్వీరాజ్- ఎఆర్ రెహమాన్ వంటి ప్రముఖులు కూడా అభిమానులతో కలిసి `భారతీయ సినిమా ఐకాన్` పేరుతో ప్రత్యేకించి వేడుకలు జరుపుకున్నారు.
మోహన్ లాల్ సామాజిక మాధ్యమాల్లో రజనీ గురించి ఇలా రాశారు. ``5 దశాబ్దాలు! 45 సంవత్సరాలు! ఒక గుర్తింపు.. భారతీయ సినిమా చిహ్నం .... మన ప్రియమైన సూపర్ స్టార్ # రజనీకాంత్ # 45@రజనీCDP ని విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ... భారతీయ సినిమా ఎదుగుదలకు సహకరించిన సూపర్ స్టార్ కి శుభాకాంక్షలు`` అంటూ మోహన్ లాల్ ప్రశంసించారు.
తమిళం సహా భారతీయ సినిమా యొక్క చిహ్నం ... మా ప్రియమైన సూపర్ స్టార్ అంటూ హీరో పృథ్వీరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఈ సెలబ్రేషన్స్ పై స్పందించారు. ఇండియన్ సినిమా ఐకాన్. మా ప్రియమైన తలైవర్ అంటూ ఆప్యాయతను కనబరిచారు.
సిరుతై శివ దర్శకత్వం వహించిన `అన్నాతే` (ఈ చిత్రంలో అతని పాత్ర పేరు) రిలీజ్ కోసం రజనీ అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. లాక్ డౌన్ వల్ల రిలీజ్ ఆలస్యం కానుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, నయనతార, ఖుష్బు సుందర్ మరియు మీనా తదితరులు నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర పోషించారు. ఇక తనకు శుభాకాంక్షలు చెప్పిన అభిమానులనుద్ధేశించి రజనీ ఎంత ఉద్వేగంగా స్పందించారు. ఇన్నేళ్ల కెరీర్ లో తనని అభిమానించిన ఫ్యాన్స్ కి సర్వదా రుణపడి ఉంటానని రజనీ అన్నారు.