Begin typing your search above and press return to search.
`పెద్దన్న` డైరెక్టర్ కి రజనీ గోల్డ్ చైన్ గిప్ట్!
By: Tupaki Desk | 11 Dec 2021 11:32 AM GMTఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్ `అన్నాథే` చిత్రంతో కోలీవుడ్ లో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రూ.240 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. యాక్షన్ ..సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన రొటీన్ ఫార్ములా సినిమా అయినా సూపర్ స్టార్ బ్రాండ్ ఇమేజ్ తో మార్కెట్ లో దూసుకుపోయింది.
కొవిడ్ పరిస్థితులు సినిమాకు కలిసొచ్చాయి. అప్పటికే థియేటర్లో బొమ్మ చూసి అభిమానులకు కొన్ని నెలలు గడిచిపోయింది. సినిమా రిలీజ్ లు లేవు. సరిగ్గా ఇద్దే సమయంలో సూపర్ స్టార్ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడంతో అభిమానులంతా క్యూ కట్టారు.
తెలుగులో `పెద్దన్న`గా రిలీజ్ అయినా ఇక్కడ సక్సెస్ అవ్వలేదు. రొటీన్ సినిమాగా తేల్చేసారు. కానీ కోలీవుడ్ లో అభిమానులు మరోసారి సూపర్ స్టార్ పై విపరీత అభిమానం చూపించారు. ఆ కారణంగానే తమిళ్ లో అంత పెద్ద విజయం సాధించింది. ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్లనే సాధించింది. కొన్ని రోజుల క్రితమే నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయింది.
అక్కడా సినిమా ట్రెండింగ్ లో నిలిచింది. దీంతో రజనీ ఆనందం రెట్టింపు అయింది. ఆ సంతోషాన్ని చిత్ర ద్శకుడు శివతో పంచుకోవాలనుకున్నారు. మరోమారు ఆలోచించకుండా వెంటనే శివ ఇంటికి రజనీ నేరుగా వెళ్లిపోయారు.
చెన్నై అన్నానగర్ లోని శివ ఇంటికి కుటుంబ సభ్యులతో రజనీ దాదాపు 3 గంటలు సమయం గడిపారు. అనంతరం శివకి ఓ గోల్డ్ చైన్ కూడా బహుకరించారు. రజనీ నేరుగా ఇంటికి రావడమే కాకుండా బహుమతి అందుకుని శివ కుటుంబం ఎంతో సంతోషించింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ పై కళానిధి మారన్ నిర్మించిన సంగతి తెలిసిందే.
మరి రజనీకి కొవిడ్ టైమ్ లో శివ మంచి సక్సెస్ ఇచ్చాడు కాబట్టి మరో ఛాన్స్ కి ఆస్కారం కనిపిస్తుంది. అన్నాథే వంద కోట్ల క్లబ్ చిత్రంగా తమిళ ఆడియెన్ కి బాగానే రీచ్ అయినా తెలుగులో మాత్రం ఆశించినంత విజయం సాధించని సంగతి తెలిసిందే.