Begin typing your search above and press return to search.

అతడి కలల ప్రాజెక్టు వేడుకకు రజనీ.. కమల్

By:  Tupaki Desk   |   5 Sept 2022 10:34 AM IST
అతడి కలల ప్రాజెక్టు వేడుకకు రజనీ.. కమల్
X
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు రజనీకాంత్.. కమల్ హాసన్. నిజానికి వీరిద్దరి సినిమాలు తమిళనాడుకే కాదు దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ క్రేజ్ ఉంటుంది. అలాంటి ఈ ఇద్దరు అగ్రతారలు ఒకే వేదిక మీద కలిసే అపూర్వ సన్నివేశం మరోసారి సాక్ష్యాత్కారం కానుంది.

వీరిద్దరు ముఖ్య అతిధులుగా హాజరు కానున్న ఆ ప్రోగ్రాం మరింత ఆసక్తికరమైనది చెప్పాలి. దేశంలో ఎంతమంది దర్శకులు ఉన్నా.. మణిరత్నం స్టైల్ వేరుగా ఉంటుంది. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు.. దాని మీద ఉండే అంచనాలు అన్ని ఇన్ని కావు.

అలాంటి మణిరత్నం కలల ప్రాజెక్టుగా చెప్పే 'పొన్నియిన్ సెల్వన్ 1 ఆడియో.. ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్.. విశ్వనటుడు కమల్ హాసన్ హాజరు కానున్నారు.

ఈ ఇద్దరు అగ్రతారలు తమ కెరీర్ ఆరంభంలో కలిసి నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు ఎక్కువే. అలాంటి ఈ ఇద్దరు ఒకే వేడుకకు రావటం ఆసక్తికరంగా మారింది.

ఈ మూవీలో విక్రమ్.. కార్తీ.. ఐశ్వర్యారాయ్.. త్రిష.. జయం రవి.. ప్రకాశ్ రాజ్.. విక్రమ్ ప్రభు లాంటి భారీ తారాగణం ఈ మూవీ కోసం పని చేశారు. చోళ రాజ్యం నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీని ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు.

ఈ నెల 30న విడుదల కానున్న ఈ మూవీకి సీక్వెల్ ఉంది. తమిళ చిత్ర పరిశ్రమ సత్తా చాటేలా ఈ మూవీ ఉంటుందని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.