Begin typing your search above and press return to search.
రజినీకాంత్ చెప్పిన ముస్లిం లింక్స్
By: Tupaki Desk | 28 Oct 2017 11:30 PM GMTఒక ప్రాంతంలో ప్రసంగం చేస్తున్నపుడు.. అక్కడి లోకల్ పీపుల్ ను ఆకర్షించేలా మాట్లాడ్డం అనే విషయం సర్వసాధారణం. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ కు ఇలాంటి విషయంలో స్పెషల్ గా చెప్పాల్సిన పనేమీ ఉండదు. హైద్రాబాద్ లో ఏవైనా ఈవెంట్స్ లో పాల్గొన్నపుడు.. ఇక్కడి లోకల్ టచ్ ఇచ్చేందుకు గాను.. బాహుబలిని.. రాజమౌళిని పొగడ్డం చూస్తూనే ఉంటాం.
ఇప్పుడు 2.0 ఆడియో ఫంక్షన్ దుబాయ్ లో జరగగా.. అక్కడి ముస్లిం సోదరులను ఆకట్టుకునేందుకు.. రజినీకాంత్ తనకు గల అనేక ముస్లిం కనెక్షన్స్ ను విప్పారు. తాను 60ల్లో కండక్టర్ గా పని చేసినపుడు.. తన తోటి డ్రైవర్స్.. కండక్టర్స్ లో అధిక శాతం ముస్లింలే ఉండేవారట. ప్రస్తుతం రజినీ ఉంటున్న పొయెస్ గార్డెన్ లోని ఇల్లు కూడా మొదట ఓ ముస్లిం యజమానిదే అన్నారు రజినీ. తన ఆరాధ్య దైవం అయిన రాఘవేంద్రస్వామి ఆలయాన్ని ఓ నవాబ్ నిర్మించారని అన్నారాయన. తన కెరీర్ లో బెస్ట్ గా నిలిచిపోయే చిత్రమైన బాషా మూవీ టైటిల్ కూడా ముస్లిం టైటిలే అన్నారు సూపర్ స్టార్.
ఇక అస్కార్ విన్నింగ్ టెక్నీషియన్స్ ఏఆర్ రెహమాన్.. సౌండ్ డిజైనర్ రసుల్ పూకుట్టిలది కూడా అదే సామాజిక వర్గం అని గుర్తు చేసిన రజినీ.. తనకు ముస్లింలలో బోలెడంత అభిమానులు ఉన్నారని చెప్పారు. దుబాయ్ జనాలను మెప్పించేందుకు రజినీ చెప్పిన లింక్స్ అన్నీ బాగానే ఉన్నాయ్ కానీ.. దీన్ని తమిళులు ఎలా తీసుకుంటారో చూడాలి.