Begin typing your search above and press return to search.
2 పాయింట్ ఓ.. అక్కడ కూడా రిలీజ్
By: Tupaki Desk | 28 Dec 2017 6:56 AM GMTశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 2.ఓ. రోబో సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు చాలానే ఉన్నాయి. ఒక్క చిత్రం కోసం 450 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టేశారనే టాక్ ఉంది. ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ మూవీగా ప్రచారం జరుగుతున్న 2.ఓ ఎన్నో సెన్సేషన్స్ సృష్టించాల్సి ఉంది.
రిలీజ్ తర్వాత సెన్సేషన్స్ సంగతి అలా ఉంచితే.. అంతకు ముందే ఈ సినిమా చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దుబాయ్ లో ఆడియో వేడుక కోసమే ఏకంగా 12 కోట్లను ఖర్చు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇప్పుడీ చిత్రం మరో రికార్డ్ సృష్టించబోతోంది. తెలుగు.. తమిళ్.. హిందీ వెర్షన్స్ లో రిలీజ్ అవుతున్న ఈ రజినీ మూవీ.. సౌదీ అరేబియాలోనూ రిలీజ్ కానుందట. ఇందుకు సంబంధించిన సన్నాహాలు అన్నీ ఇప్పటికే పూర్తయినట్లుగా చెబుతున్నారు. ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాను.. అదే రోజున సౌదీలో కూడా విడుదల చేస్తారట.
దాదాపు 30 ఏళ్ల నిషేధం తర్వాత.. రీసెంట్ గానే సౌదీలో సినిమాల ప్రదర్శనపై ఆంక్షలు తొలగించారు. అలా బ్యాన్ తొలగించగానే.. ఇలా 2.ఓ ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లను స్టార్ట్ చేసేయడం విశేషం. సౌదీలో రిలీజ్ అవుతున్న తొలి దక్షిణాది చిత్రంగా రజినీకాంత్ మూవీ రికార్డ్ సృష్టించనుంది. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్.. అమీ జాక్సన్ లు కూడా నటించడం.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం.. ఈ మూవీకి అదనపు అట్రాక్షన్స్.