Begin typing your search above and press return to search.

కబాలి ఎకౌంట్ హ్యాక్ చేసి.. ట్వీటేసి..

By:  Tupaki Desk   |   3 Aug 2016 9:15 AM GMT
కబాలి ఎకౌంట్ హ్యాక్ చేసి.. ట్వీటేసి..
X
ఎవరి ట్విట్టర్ ఎకౌంట్లు హ్యాక్ అవ్వట్లేదు చెప్పండి? మన మహేష్‌ బాబు ఎకౌంట్ కూడా గతంలో ఇలాగే హ్యాక్ అయ్యింది. అప్పుడు హ్యాక్ చేసిన వ్యక్తి మా టివి అవార్డుల గురించి సెటైర్లు వేశాడు. మహేష్‌ పాస్ వార్డ్ మార్చడంతో అంతా సెట్టయిపోయింది. ఇప్పుడు ''కబాలి'' సూపర్ స్టార్ రజనీకాంత్ ఎకౌంట్ కూడా ఇదే విధంగా హ్యాక్ అయింది తెలుసా. పదండి చూద్దాం.

గత రాత్రి రజనీకాంత్ ట్విట్టర్ ఎకౌంట్ నుండి సడన్ గా హిట్ టు కిల్ (#HitToKill) అంటూ ఒక హ్యాష్‌ ట్యాగ్ ట్వీటొచ్చి పడింది. అదేంటో అస్సలు ఎవ్వరికీ అర్ధంకాలేదు. అదేమన్నా కబాలి సినిమాలోని డైలాగా? లేకపోతే తమిళ రాజకీయాలపై రజనీకాంత్ ఏమన్నా పంచ్ వేశారా? ఏమీ అర్ధంకాలేదు. ఈ తరుణంలో ఆయన కూతురు ఐశ్వర్య ధనుష్‌ స్పందిస్తూ.. నాన్నగారి ట్విట్టర్‌ ఎకౌంట్ హ్యాకైంది.. పోలీస్ కంప్లయింట్ ఇచ్చాం.. ఇప్పుడు అంతా సెట్టయింది. అంటూ తెలియజేసింది. ఎవరో సాఫ్టువేర్ ఇంజనీర్ ఈ ట్విట్టర్ ను హ్యాక్ చేసినట్లు చెబుతున్నారు.

గతంలో ఓసారి నారా లోకేష్‌ అటెండ్ అయిన ప్రోగ్రామ్ గురించి చంద్రబాబు ఎకౌంట్ నుండి ట్వీట్లొచ్చి పడ్డాయ్. నిమిషాల్లో డెలీట్ చేశారు కూడా. ఆ తరువాత అవి లోకేష్‌ ఎకౌంట్ నుండి ట్వీట్ చేశారు. అప్పుడు అర్ధమైంది.. చాలామంది పెద్దల ట్విట్టర్ ఎకౌంట్లు వారి పిల్లలే నిర్వహిస్తుంటారని. ఇప్పుడు ఒకవేళ రజనీ కూడా కూతుళ్ల చేతిలో ట్విట్టర్ పేజీ పెట్టారా అనే సందేహం వస్తోంది కదూ.