Begin typing your search above and press return to search.
ట్విట్టర్ లో యాక్టివ్ అవుతున్న రజనీ
By: Tupaki Desk | 22 Aug 2016 11:30 AM GMTసాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే రజనీకాంత్ సడెన్ గా ట్విట్టర్ లో స్పీడు పెంచారు. విలక్షణ నటుడు కమలహాసన్ - ఒలింపిక్సు రజత పతక విజేత సింధులను అభినందిస్తూ ఆయన వేర్వేరు పోస్టులు పెట్టడంతో రజనీ అభిమానులు ఆ ట్వీట్లను తెగ రీట్వీట్ చేస్తున్నారు. ‘కబాలి’కి ట్విట్టర్ లో 3.1 మిలియన్ మంది ఫాలోయర్స్ ఉన్నా కూడా ఆయన స్వయంగా పోస్టులు పెట్టడం చాలా అరుదు. ఆయన 23 అకౌంట్లు మాత్రమే ఫాలో అవుతారు. అందులోనూ ఎక్కువగా న్యూస్ చానెల్స్ ఉంటాయి. చాలా మంది సెలబ్రిటీలు - రాజకీయ నాయకులు తమ ఓటర్స్ తో - అభిమానులతో లేదా ఫాలోయర్స్ తో ట్విట్టర్ ద్వారా టచ్ లో ఉంటారు కానీ రజనీకాంత్ మాత్రం చాలా అరుదుగా ట్వీట్ చేస్తుంటారు. ఇప్పుడు తన సహనటుడు కమల్ - దేశానికి పతకం తెచ్చిన సింధు కోసం ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.
కమల్ కు ప్రతిష్ఠాత్మక 'షెవలీర్ డి లార్డ్ ఆర్ట్స్ ఎట్ లెటర్స్' అవార్డు వచ్చిన సందర్భంగా రజనీ స్పందించారు. తన ప్రియమైన మిత్రుడు హాసన్ కు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్టు ప్రకటించారు. 'నిన్నటి తరానికి నడిగర తిలకం శివాజీ గణేశనే. ఈతరంలో మాత్రం ఆ బిరుదు ఒక్క కమలహాసన్ కు మాత్రమే సరిపోతుంది' అని సూపర్ స్టార్ రజనీకాంత్ పొగడ్తల వర్షం కురిపించారు. కాగా కళారంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా కమల్ కు ఫ్రాన్సు ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రకటించింది. ఆ వెంటనే రజనీ ట్విట్టర్ లో ఇలా స్పందించారు. వ్యక్తిగతంగానూ ఆయన కమల్ ను ప్రత్యేకించి అభినందించారు.
మరోవైపు రియో పతక విజేత - తెలుగు బిడ్డ పీవీ సింధుకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాట్సాఫ్ టు యు పీవీ సింధు. నేను మీకు గొప్ప ఫ్యాన్‌గా మారాను. కంగ్రాచ్యులేషన్సు’ అని రజనీకాంత్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను 19 వేల మంది షేర్ చేశారు. పెద్దగా సోషల్ మీడియాలో స్పందించని రజనీ నుంచి సింధుకు ప్రశంసలు దక్కడం నిజంగా అపూర్వమే.