Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ డాన్ పాత్ర‌లో ర‌జ‌నీ

By:  Tupaki Desk   |   19 July 2018 10:21 AM GMT
మ‌ళ్లీ డాన్ పాత్ర‌లో ర‌జ‌నీ
X
ర‌జ‌కీకాంత్‌ కీ... డాన్ పాత్ర‌ల‌కీ మ‌ధ్య సంబంధం అంతా ఇంతా కాదు. బాషా సినిమాలో ఆయన డాన్‌ గా క‌నిపించి ప్రేక్ష‌కుల్ని ముగ్ఢుల్ని చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్నుంచి ఆయ‌న్ని త‌ర‌చుగా అలాంటి పాత్ర‌ల్లో చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ద‌ర్శ‌కులు. అయితే కొన్ని క్లిక్క‌య్యాయి - కొన్ని అవ్వ‌లేదు. ర‌జ‌నీకాంత్ స్టైల్‌ కీ - ఆయ‌న హీరోయిజానికి డాన్ పాత్ర‌లు బాగా న‌ప్పుతాయి. అందుకే ఈమ‌ధ్య `కబాలి` - `కాలా` చిత్రాల్లో కూడా ర‌జ‌నీకాంత్‌ ని డాన్‌ గానే చూపించారు. అయితే ఆ చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల్ని మెప్పించలేక‌పోయాయి.

అయినా స‌రే... కొత్త చిత్రం కోసం మ‌రోమారు ర‌జ‌నీ డాన్ అవ‌తార‌మెత్త‌బోతున్నాడు. కాక‌పోతే ఈ సినిమాలో డే అంతా కూడా ఒక హాస్ట‌ల్ వార్డెన్‌ గా... రాత్రిపూట మాత్రం డాన్‌ గా మారిపోతున్నాడ‌ట‌. మ‌రి రాత్రిళ్ల‌లో ఈ డాన్ ఏం చేస్తాడ‌న్న‌ది తెలియాలంటే కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న కొత్త చిత్రం విడుద‌ల కావ‌ల్సిందే. త‌మిళంలో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు తీసిన ద‌ర్శ‌కుడు కార్తీక్‌. ఈయ‌న చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ ర‌జ‌నీ ఈ సినిమా చేయ‌డానికి అంగీక‌రించారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ర‌జ‌నీ చేయ‌బోయే ఆఖ‌రి చిత్రం ఇదే అని స‌మాచారం. ఈ చిత్రం త‌ర్వాత ర‌జ‌నీ పూర్తిస్థాయిలో రాజ‌కీయాల‌పై దృష్టిపెట్ట‌బోతున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం డెహ్రాడూన్లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఆ త‌ర్వాత మ‌ధురైలో వేసిన సెట్లో షూటింగ్ జ‌రుగుతుంది. ఇందులో బాలీవుడ్ న‌టుడు నవాజుద్దీన్ సిద్ధికీతో పాటు సీనియ‌ర్ తార సిమ్రాన్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు.