Begin typing your search above and press return to search.
అక్కడ రజినీ-కమల్ సినిమాలపై నిషేధం?
By: Tupaki Desk | 10 April 2018 9:02 AM GMTరజినీకాంత్... తమిళంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్న సూపర్ స్టార్. కమల్ హాసన్... తన నటనతో అశేషమైన అభిమానులను సొంతం చేసుకున్నవిశ్వనాయకుడు. వీరి సినిమాలు విడుదలైతే తమిళనాడులోనే కాదు... రెండు తెలుగు రాష్ట్రాలు- కర్ణాటక- కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సందడి నెలకొంటుంది. అయితే సినిమాలతో ఆగకుండా రాజకీయాల్లోకి దిగి- అధికారం చేజిక్కుకోవాలని తెగ ఆరాటపడుతున్నారిద్దరూ. దీంతో ఇప్పుడు వారి సినిమాలకు గడ్డు కాలం వచ్చింది. అనవసర విషయాల్లో వేలుపెడుతున్న ఈ స్టార్ల సినిమాలను బ్యాన్ చేయాలని అనుకుంటోందట ఓ దక్షిణాది రాష్ట్రం.
కావేరి జలాల వివాదంతో కర్ణాటక- తమిళనాడు రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదం మరీ ముదిరి పాకన పడడంతో తమిళ సూపర్ స్టార్లు కూడా ఈ విషయం గురించి స్పందించారు. ఇద్దరూ కావేరి జలాల విషయంలో తమిళ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటూ గొంతు విప్పారు. రజినీకాంత్ అయితే ఒకడుగు ముందుకేసి... ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీం సభ్యులు నల్ల బ్యాచ్ ధరించి నిరసన తెలపాలని కోరాడు కూడా. దీంతో వీరి సినిమాలను కర్ణాటకలో విడుదల కాకుండా నిషేధం విధించాలని భావిస్తున్నారు కన్నడ డిస్టిబ్యూటర్లు. వటల్ నాగరాజు అనే కన్నడ ఉద్యమనేత కమల్- రజినీ సినిమాలను కర్ణాటకలో విడుదల కాకుండా నిషేధం విధించాలని కన్నడ డిస్టిబ్యూటర్లకు పిలుపునిచ్చాడు. ఆయన పిలుపుపై అక్కడి డిస్టిబ్యూటర్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్టు సమాచారం.
దీంతో త్వరలో విడుదల కాబోతున్న రజినీ ‘కాలా’... కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’ సినిమాలు కన్నడ సీమలో విడుదల కావడం కష్టమే. రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఎదగాలని తెగ ప్రయత్నాలు చేస్తున్న ఈ ఇద్దరికీ సినిమాల బ్యాన్ అనేది పెద్ద షాకే. మరి ఈ నిషేధంపై తలైవా... లోకనాయకుడు ఎలా స్పందిస్తారో చూడాలి.