Begin typing your search above and press return to search.
రాజ్యసభకు ఇళయరాజా..రజనీ - కమల్ రెస్పాన్స్!
By: Tupaki Desk | 7 July 2022 6:30 PM GMTలెజెండరీ సంగీత దర్శకుడు.. ఇసైగ్నియాని ఇళయరాజాను భారత రాష్ట్రపతి శ్రీ రాజ్ నాథ్ కోవింద్ రాజ్యసభకు ఎంపీగా నామినేట్ చేశారు. ప్రధాన మంత్రి.. నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తూ ``అయ్యా .. రాజా జీ సృజనాత్మక మేధావి.. ఆయన తరతరాలుగా ప్రజలను ఉర్రూతలూగించారు. అతని సంగీతం అనేక భావోద్వేగాలను అందంగా ప్రతిబింబిస్తుంది. అతని జీవిత ప్రయాణం కూడా అంతే స్పూర్తిదాయకం. ఎంతో వినయంతో ఎదిగి ఇంతటి ఘనత సాధించినందుకు సంతోషిస్తున్నాను. తను రాజ్యసభకు నామినేట్ అయ్యారు`` అని తెలిపారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయిన నా ప్రియమైన స్నేహితుడు ఇళయరాజాకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని రాశారు. మరోవైపు కమల్ హాసన్ వ్యాఖ్యానిస్తూ.. ``ఇళయరాజాతో సమానం లేదా మించిన వారు ఎవరూ లేరు. అతని సంగీత సేవను గౌరవించబడాలంటే భారత రాష్ట్రపతి పదవిని ఏకగ్రీవంగా ప్రదానం చేయాలి. అయినప్పటికీ మేము ఎంపీ నామినేషన్ ను స్వాగతించాలి. కూడా`` అంటూ పోయెటిగ్గా స్పందించారు.
రజనీ - కమల్ ఇద్దరూ ఇళయరాజాతో సుదీర్ఘ అనుబంధాన్ని కలిగి ఉన్నారు. వారి సినిమాలకు వందలాది హిట్ పాటలను రాజా అందించారు. అవన్నీ ప్రధాన హైలైట్స్ గా మార్చారు. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో వేలాది మంది భారతీయ సినీ పరిశ్రమ ప్రముఖులు అభిమానులు మాస్ట్రోకు శుభాకాంక్షలు తెలిపారు.