Begin typing your search above and press return to search.
రజనీ.. కమల్.. ఏంటీ పాలిటిక్సు?
By: Tupaki Desk | 19 Oct 2015 6:47 PM GMTదేశంలో జరిగే అత్యంత కీలకమైన సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ఆసక్తి ఉంటుందో.. తమిళనాట జరిగే నడిగార్ సంఘం ఎన్నికలకు కూడా అంతే క్రేజ్ వచ్చేసింది. కారణం ఏంటంటే.. ఇక్కడ మనకు తెలిసిన కొందరు క్రేజీ హీరోలు సాధారణ రాజకీయ నాయకుల్లాగా రోడ్డున పడి నీలాపనిందలు కురిపించుకోవడమే. వీళ్ళు వేసే సెటైర్లకు జనాలకు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. అయినా సరే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటూ అందరూ ఉత్సాహంగా చూశారు.. చివరకు విశాల్ గెలిచాడులేండి.
ఇకపోతే ఈ ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చిన రజనీకాంత్.. కమల్ హాసన్ లు.. గెలిచిన విశాల్ ప్యానల్ ను బాగా కన్ఫ్యూజన్ లోకి నెట్టేశారు. ఎందుకంటే.. వీళ్లిచ్చిన సలహాలు అలా ఉన్నాయ్ మరి. నడిగార్ సంఘం పేరును 'తమిళనాడు నడిగార్ సంఘం' అని మార్చమని రజనీకాంత్ సలహాలిస్తే.. దీనిని 'దక్షిణ భారతదేశం నడిగార్ సంఘం' అని మార్చాలని కమల్ చెప్పారు. డిమాండ్లు నెరవేర్చని పక్షంలో ఈ ప్యానెల్ రాజీనామా చేయాలని రజనీ సెలవిస్తే.. కమల్ కూడా ఇంకోటేదో చెప్పారు. ఇప్పటికే ఈ నడిగార్ సంఘం పేరు 'సౌత్ ఇండియన్ ఆర్టిస్టుల ఆసోసియేషన్' అని ఉంది. దీనిని మళ్లీ మార్చడమేంటో మరి. అప్పట్లో మద్రాస్ లోనే సినిమాలన్నీ తీసేవారు కాబట్టి.. ఆ పేరును పెట్టారు. ఇప్పుడు మద్రాస్ ఎలియాస్ చెన్నయ్ లో కేవలం తమిళ సినిమాల తీస్తున్నారు కాబట్టి రజనీ పేరును మార్చమంటున్నారు. ఇక కమల్ చెప్పేది కూడా కరక్టే. తమిళంలో తీసే సినిమాలు ఎలాగో చాలా బాషల్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి.. సౌత్ ఇండియన్ అసోసియేషన్ అని ఉంటే తప్పేముందిలే..
అయినాసరే.. అసలు పేరు గురించి ఈ పాలిటిక్సు ఏంటండీ? ఇదేదో తెలంగాణ అని పెట్టండి.. ఆంధ్ర అని పెట్టండి అని అడిగినట్లు ఉంది. ఏదేమైనా ఈ పాలిటిక్స్ వెనుక అసలు కారణాలు ఏంటనేది త్వరలోనే తెలుస్తాయిలే.