Begin typing your search above and press return to search.
రజినీ, విజయ్.. మంచి పని చేశారు..
By: Tupaki Desk | 19 May 2016 8:07 AM GMTతమిళనాడులో రాజకీయాలకు, సినిమాలకు విడదీయలేని సంబంధం ఉంది. పైగా అధికారంలోకి వచ్చిన వారు అవతలివారి కక్ష సాధించే సౌలభ్యం కూడా అక్కడ కంటిన్యూ అవుతుంది. గత ఎలక్షన్స్ లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు వ్యతిరేకంగా మాట్లాడిన స్టార్ హీరోలకు.. ఆ తర్వాత అమ్మ చుక్కలు చూపించింది.
స్టార్ హీరో విజయ్ సినిమాలు కూడా రిలీజ్ కి ముందు ప్రతీసారీ ఇబ్బంది ఎదుర్కోవడానికి కారణం.. అమ్మకు కోపం రావడమే. ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడూలేనంత ఆసక్తిగా సాగాయి. గెలుపుపై తాసు ఊగుతూ వచ్చినా.. చివరకు అమ్మనే విజయం వరించింది. ఇది సూపర్ స్టార్ రజినీకాంత్, ఇలయ దళపతిలు సంతోషించాల్సిన సందర్భంగా మారింది. గతంలో వీరు రాజకీయాలపై మాట్లాడి అనవసరంగా ఇరుక్కున్నారు. ఈ సారి మాత్రం అలాంటి పొరపాట్లు చేయకుండా.. చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఓటు వేయమన్నారు తప్ప.. ఎవరికి వేయాలనే విషయంపై మాత్రం ఎక్కడో నోరు జారలేదు.
అటు కరుణానిధికి కానీ, ఇటు జయలలితకు కానీ సపోర్ట్ ఇవ్వలేదు. మిగతా మీడియా మాదిరిగా ఒకవేళ కరుణానిధి గెలుస్తాడని అంచనాలు వేసి.. రజనీకాంత్ - విజయ్ కనుక జయలలితకు వ్యతిరేకంగా ఏమన్నా కామెంట్లు చేసుంటే.. వీళ్లకు బాక్సాఫీస్ దగ్గర బాక్సు బద్దలైపోయేదే. కానీ అప్పుడు తీసుకున్న జాగ్రత్త.. ఇప్పుడు కలిసొచ్చింది. మొత్తానికి వివాదంలో ఇరుక్కోకుండానే ఎన్నికల తంతు పూర్తి చేసుకోగలిగారు తమిళ సాంబార్ స్టార్లు.