Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ కాలా - 2.0తో ఆగట్లేదు

By:  Tupaki Desk   |   23 Feb 2018 12:04 PM GMT
సూపర్ స్టార్  కాలా - 2.0తో ఆగట్లేదు
X
సూపర్ స్టార్ రజనికాంత్ తన రాజకీయ రంగప్రవేశం గురించి ప్రకటన చేసిన తరువాత కూడా ఆయన సినిమాలు ఆపబోవడం లేదని స్పష్టమైంది. ప్రస్తుతం కాలా, 2.0 రెండు సినిమాలు ఒకేసారి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న సంగతి తెలిసిందే. కాలా ఏప్రిల్ 27 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోగా 2.0 స్వతంత్ర దినోత్సవం నాడు లేదా దీపావళికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. ఒకే ఏడాది రజినికాంత్ రెండు సినిమాలు కావడం చాలా ఏళ్ళ తర్వాత జరుగుతోంది. ఇక వీటి తర్వాత రజని తన పార్టీ కార్యకలాపాల్లో బిజీ అవుతాడేమో అనుకున్న అభిమానులకు, రాజకీయ పరిశీలకులకు తన సినిమా ప్రకటన ద్వారా సూపర్ స్టార్ స్వీట్ షాక్ ఇచ్చాడు. ఈ మేరకు సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.

వైవిధ్యమైన సినిమాల దర్శకుడిగా పేరున్న కార్తిక్ సుబ్బరాజ్ మొదటిసారి రజని సినిమా చేయబోతున్నాడు. గత ఏడాది వచ్చిన ఇరైవి ద్వారా విమర్శకులు సైతం ఔరా అనేలా మెప్పించిన కార్తీక్ సుబ్బరాజ్ గతంలో పిజ్జా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇప్పుడు ఇతనితో రజని జత కట్టడం అంటే తలైవా ఫాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనుందని తెలిసింది. షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు.

ఇలా వరసగా సినిమాలు చేయటంలో రజని ఉద్దేశం ఏంటో కాని అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. పార్టీని నడిపించాల్సిన బాధ్యతతో పాటు తనకు రాజకీయాల్లో కూడా ప్రత్యర్థిగా మారనున్న కమల్ హాసన్ కు ధీటుగా రజని కూడా ప్రజా క్షేత్రంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఇది దృష్టిలో పెట్టుకునే కొత్త సినిమాకు ఓకే చెప్పాడా లేక పాత కమిట్మెంట్ ఏదైనా బాలన్స్ ఉండటం వల్ల చేస్తున్నాడా అనే దాని గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.