Begin typing your search above and press return to search.

టెన్షన్ తగ్గించిన రజినీ

By:  Tupaki Desk   |   30 Dec 2017 10:43 AM GMT
టెన్షన్ తగ్గించిన రజినీ
X
2018 సమ్మర్ లో స్టార్ హీరోల సినిమాలు రాబోతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏప్రిల్ లో రావడానికి అల్లు అర్జున్ - మహేష్ బాబు చాలా స్పీడ్ స్పీడ్ గా షూటింగ్ లను పూర్తి చేస్తున్నారు. అయితే వారిని గత కొంత కాలంగా రజినీకాంత్ బయపెడుతుండడం చర్చనీయాంశంగా మారింది. నా పేరు సూర్య - భరత్ అనే నేను ఏప్రిల్ 27ను ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నాయి. కానీ జనవారి 26న రిలీజ్ అవుతుంది అనుకున్న 2.0 ఒక్కసారిగా ఏప్రిల్ లోకి జంప్ చేసింది.

దీంతో ఆ రెండు టాలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ లపై పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది. రజినీకాంత్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే కలెక్షన్స్ లో తేడా రాకూడదని దాని ముందు లేక తరువాత సినిమాలను రిలీజ్ చేద్దామని అనుకున్నారు మన స్టార్స్. గత కొంత కాలంగా కొత్త కొత్త తేదీలు వినిపిస్తున్నా కూడా చిత్ర యూనిట్ మాత్రం కరెక్ట్ గా ఫిక్స్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు ఫైనల్ ఒక నిర్ణయినికి రావాల్సిన ఛాన్స్ వారికీ దక్కింది. ఎందుకంటే రజినీకాంత్ విడుదల తేదీని చెప్పేశాడు.

ప్రస్తుతం రజినీకాంత్ తన అభిమానులతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2.0 సినిమా విడుదల తేదీని కూడా చెప్పేశాడు. సినిమా తప్పకుండా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోందని చెప్పేశాడు. దీంతో నా పేరు సూర్య- భరత్ అనే నేను సినిమాలు హ్యాపీగా ముందు అనుకున్న తేదీలకే విడుదల కావచ్చు. ఫైనల్ గా ఓ క్లారిటీ రావడంతో అటు రజినీ అభిమానులకు ఇటు స్టార్ హీరోలకు టెన్షన్స్ తగ్గింది.