Begin typing your search above and press return to search.
2.0 రిలీజ్ డేట్ పై రజినీ కొత్త మాట
By: Tupaki Desk | 8 Feb 2018 11:18 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్-ఏస్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాగ్నమ్ ఓపస్ ‘2.0’ రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఆ మధ్య తన అభిమానులతో సమావేశం సందర్భంగా ‘2.0’ తమిళ కొత్త సంవత్సరాది కానుకగా ఏప్రిల్ 14న విడుదలవుతుందని రజినీకాంతే స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు రజినీనే మాట మార్చేశాడు.
‘2.0’ రిలీజ్ గురించి మాట్లాడుతూ రజినీ కొత్త డేట్ చెప్పాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు రజినీ ప్రకటించాడు. ఆ తేదీని అందుకునేందుకు చిత్ర బృందం కష్టపడుతోందని.. విజువల్ ఎఫెక్ట్స్.. ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సమాంతరంగా జరుగుతున్నాయని రజినీ చెప్పాడు. ఐతే ‘2.0’తో పాటు తన మరో సినిమా ‘కాలా’ కచ్చితమైన రిలీజ్ డేట్లు ఏంటన్నది తర్వాత చెబుతామని రజినీ అన్నాడు.
‘2.0’ ఏప్రిల్లో కూడా రిలీజవ్వదని.. అది మరింత ఆలస్యమవుతుందని.. దీంతో ముందుగా ‘కాలా’ను ఏప్రిల్ 14న రిలీజ్ చేసేయాలని చూస్తున్నారని రెండు రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ రజినీ మాత్రం ఏప్రిల్ 27కే ‘2.0’ రిలీజ్ ప్లాన్ చేసినట్లు చెబుతున్నాడు. మరి అదే తేదీకి ‘నా పేరు సూర్య’ రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్న ఆ చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.