Begin typing your search above and press return to search.
అల్లుడి బర్త్ డే.. తలైవా ఆశీర్వాదం
By: Tupaki Desk | 29 July 2016 7:45 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ తన మూవీ కబాలి రిలీజ్ కి కూడా ఎక్కడా కనిపించలేదు. కనీసం ఫ్యాన్స్ కోసం ఒక మాట కూడా మాట్లాడలేదు. హెల్త్ ప్రాబ్లెం అంటూ అమెరికాలో ఉన్న రజినీ.. సినిమా విడుదలయ్యాక ఇండియా వచ్చారంతే. వచ్చాకయినా ఓ నోట్ తప్పితే.. ఫ్యాన్స్ కోసం ఒక్కటంటే ఒక్కసారి కూడా కనిపించలేదు. కానీ అల్లుడు ధనుష్ కోసం మాత్రం సూపర్ స్టార్ టైమ్ కేటాయించడం విశేషం.
జూలై 28న కోలీవుడ్ స్టార్ హీరో కం.. సూపర్ స్టార్ అల్లుడు ధనుష్ బర్త్ డే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో రజినీకాంత్ దర్శనమిచ్చారు. ఓ సింపుల్ టీషర్ట్ తో కనిపించిన రజినీ.. పెద్ద హెడ్ ఫోన్స్ ను మెడకు తగిలించుకున్నారు. పార్టీకి వచ్చిన పలువురితో సరదాగా గడపిన ఆయన.. అల్లుడితో ప్రత్యేకంగా టైమ్ స్పెండ్ చేశారు. మామతో కలిసి దిగిన ఫోటోను ఫ్యాన్స్ కు చూపించేందుకు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ధనుష్.. 'బ్లెస్సింగ్స్.. బ్లెస్డ్' అంటూ తన సంతోషాన్ని చెప్పాడు.
అల్లుడి కోసం ఇంత టైమ్ కేటాయించిన సూపర్ స్టార్.. కోట్లు పోసి సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు.. వందలు వేలు పోసి టికెట్లు కొంటున్న ఆడియన్స్ ఫ్యాన్స్ కోసం కూడా కొంత టైమ్ కేటాయిస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.