Begin typing your search above and press return to search.

అసలు రాఖీ పేరు చెప్పావేంటి రజనీ??

By:  Tupaki Desk   |   22 Nov 2016 5:30 PM GMT
అసలు రాఖీ పేరు చెప్పావేంటి రజనీ??
X
టూ మచ్ అంటే టూ మచ్ కాదు.. ఏకంగా టూ మచ్ కే తాత అని చెప్పాలి.. సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్స్. ఆయన సరదాకే చేసినా కూడా.. అందులో చాలా డెప్త్ మీనింగ్ కనిపించటంలో.. ఇప్పుడు 2.0 ఫస్ట్ లుక్ ఈవెంట్ లాంచ్ లో చోటుచేసుకున్న ప్రశ్నోత్తరాలన్నీ కాంట్రోవర్షియల్ గా మారిపోయాయ్.

మామూలుగా కాంట్రోవర్శీలకు ఆమడ దూరంలో ఉండే రజనీకాంత్.. మొన్న కరణ్‌ జోహార్ ''బాలీవుడ్ క్వీన్ ఎవరో చెప్పు'' అంటూ ఒక ప్రశ్న అడిగితే.. మనోడు చిట్టి రోబో గెటప్ లో ఉన్నాడు కాబట్టి.. ఒక విలక్షణ ఆన్సర్ చెప్పాడు. ''మాధురి దీక్షిత్.. శ్రీదేవి.. ఐశ్వర్య రాయ్.. అనుష్క శర్మ.. రాఖీ సావంత్..'' అంటూ ఆన్సర్ ఇవ్వబోయాడు రోబో రజని. అయితే రాఖీ సావంత్ పేరు చెప్పగానే కరణ్‌ జోహార్.. బాబూ చాలు అంటూ ఆపేయమన్నాడు. ఈ కామెడీ బాగానే ఉంది కాని.. అసలు రాఖీ బాలీవుడ్ క్వీన్ కాదని అందరికీ తెలిసినప్పుడు.. మనోళ్లు కావాలని ఫన్ కోసం ఆమెను పేరు లాగడం ఎందుకు?

అసలే రాఖీ సావంత్ కూడా ఒక ఫైర్ బ్రాండ్ సెక్స్ బాంబ్. నోటికి ఏమొస్తే అదే అనేస్తుంది. వెనుకా ముందూ అస్సలు ఆలోచించదు. అందుకే రజనీకాంత్ వంటి పెద్దలు ఆమెను కెలక్కుండా ఉంటేనే బెటర్. కాని రాఖి మాత్రం.. ఈ ఎపిసోడ్ అంతా చూసి.. ''2.0'' సినిమా రిలీజయ్యాక రజనీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆశగా చూస్తోందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/