Begin typing your search above and press return to search.

100 నుండి 50 కి పడి పోయిన సూపర్‌ స్టార్‌ క్రేజ్‌

By:  Tupaki Desk   |   11 Feb 2020 5:30 PM GMT
100 నుండి 50 కి పడి పోయిన సూపర్‌ స్టార్‌ క్రేజ్‌
X
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఈమద్య కాలంలో వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. ఆయన తన ప్రతి సినిమాకు భారీ పారితోషికాన్ని అందుకుంటున్నాడు. సినిమా బడ్జెట్‌ తో సంబంధం లేకుండా.. బాలీవుడ్‌ స్టార్స్‌ ను మించిన పారితోషికాన్ని రజినీకాంత్‌ తీసుకుంటున్నాడు. ఇటీవల విడుదల అయిన దర్బార్‌ చిత్రంకు గాను రజినీకాంత్‌ ఏకంగా వంద కోట్ల పారితోషికం ను తీసుకున్నట్లుగా ఆ మద్య తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. సినిమాకు అయిన బడ్జెట్‌ తో పోల్చితే ఆయన పారితోషికం మరీ ఎక్కువ.

రజినీకాంత్‌ పారితోషికం చాలా ఎక్కువ అవ్వడం వల్ల సినిమాను అంతే స్థాయి లో భారీ రేటు పెంచి అమ్మారు. కాని దర్బార్‌ చిత్రం 50 కోట్ల మేరకు నష్టాలను చవి చూసింది. దాంతో బయ్యర్లు మొత్తంను చెల్లించాల్సిందిగా నిర్మాత.. దర్శకుడు.. హీరోలపై పడ్డారు. ఇప్పుడు ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. దర్బార్‌ ను గుణపాఠంగా తీసుకుని రజినీకాంత్‌ తో ప్రస్తుతం శివ దర్శకత్వంలో రజినీ168 ను నిర్మిస్తున్న సన్‌ పిక్చర్స్‌ అధినేత కళనిధి మారన్‌ బడ్జెట్‌ కోత పెడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

దర్బార్‌ చిత్రానికి వంద కోట్లు తీసుకున్న రజినీకాంత్‌ ఈ చిత్రానికి కూడా అంతే డిమాండ్‌ చేయడం నిర్మాత కూడా అందుకు ఓకే అనడం జరిగింది. సినిమా అమ్ముడు పోయిన తర్వాత పారితోషికం ఇచ్చేట్లుగా ఒప్పందం చేసుకున్నారు. కాని దర్బార్‌ చిత్రం ఇచ్చిన షాక్‌ తో సినిమా ఆ రేంజ్‌ లో అమ్ముడు పోవడం అసాధ్యం. అందుకే తాజాగా రజినీకాంత్‌ ను 55 కోట్లకు కళానిధి మారన్‌ సెట్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

బయ్యర్ల పై ప్రభావం లేకుండా ఉండాలనే ఉద్దేశ్యం తో రజినీకాంత్‌ పారితోషికం విషయం లో వెనక్కు తగ్గక తప్పలేదట. ఒక్క సినిమా ఎఫెక్ట్‌ తో 100 కోట్ల పారితోషికం కాస్త 50 కోట్లకు పడిపోవడం ఆశ్చర్యకర విషయం. రజినీకాంత్‌ క్రేజ్‌ మునుపటి తో పోల్చితే లేదు. కనుక ఆ విషయాన్ని గుర్తించి రజినీకాంత్‌ తన పారితోషికం ను నిర్ణయించాలంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.