Begin typing your search above and press return to search.
రజనీ సార్.. ఈ మాటలు బాగానే చెబుతాడు
By: Tupaki Desk | 27 Nov 2018 11:20 AM GMTతెలుగు వాళ్లు చాలా మంచోళ్లట. తన మీద అమితమైన ప్రేమ చూపిస్తారట. తెలుగు భోజనం ప్రపంచ ప్రసిద్ధి చెందిందట. ఇక తెలగు అమ్మాయిల గురించి చెప్పాల్సిన పనే లేదట. తన కొత్త సినిమా ‘2.0’ ప్రి రిలీజ్ ప్రెస్ మీట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ అన్న మాటలివి. ఇలాంటి మాటలకేమీ తక్కువ లేదు. తన సినిమా రిలీజవుతున్న ప్రతిసారీ ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలుగు వాళ్ల ఉదార స్వభావం గురించి.. తన మీద.. తన సినిమాల మీద చూపించే ప్రేమ గురించి గొప్పగా మాట్లాడేస్తుంటాడు సూపర్ స్టార్. కానీ తెలుగువాళ్లపై ఆయన చూపించే ప్రేమే ప్రశ్నార్థకం అవుతుంటుంది. కొన్నేళ్ల కిందట హుద్ హుద్ తుపాను బీభత్సానికి వైజాగ్ సిటీ అతలాకుతలం అయింది. అప్పుడు తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఏకమై ఆదుకునే ప్రయత్నం చేసింది.
సరిగ్గా ఆ సమయంలోనే తన సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడికి వచ్చాడు రజనీ. తుపాను బాధితుల్ని ఆదుకోవాలని రజనీకి కొందరు విజ్ఞప్తి చేస్తే.. తప్పనిసరి అయి ప్రకటన చేశాడు. చెన్నైకి వెళ్లి దీనిపై పరిశీలించి సాయం ప్రకటిస్తానన్నాడు. అక్కడికి వెళ్లి మొక్కుబడిగా ఐదు లక్షలు పడేశాడు. రజనీ మార్కెట్ ఎంత.. ఆయన తీసుకునే పారితోషకం ఎంత.. తెలుగులో ఆయన సినిమాలకు వచ్చే వసూళ్లెంత.. వాటితో పోలిస్తే ఈ ఐదు లక్షలు ఎక్కడికి వస్తాయి? ఈ విషయంలోనే కాదు.. తన సినిమాలు కొని బయ్యర్లు నష్టపోతే ఆదుకునే విషయంలోనూ రజనీ పక్షపాతం చూపిస్తుంటారు. తమిళ బయ్యర్లను పలుమార్లు ఆదుకున్నాడాయన. కానీ ఆయన సినిమా కొని ఇక్కడ దారుణంగా నష్టపోయిన వాళ్లను ఏనాడూ పట్టించుకున్నది లేదు. వ్యక్తిగతంగా రజనీకి చాలా మంచి వాడనే పేరుంది. గొప్ప ఇమేజ్ ఉంది. కానీ తెలుగు వాళ్ల విషయంలో మాత్రం రజనీ ఎప్పుడూ అంత ఉదారంగా వ్యవహరించింది లేదు. వాళ్లపై ప్రత్యేక ప్రేమ చూపించింది లేదు. తన సినిమా రిలీజవుతుంటే ఇక్కడికి వస్తాడు. ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోతాడు. అదే సమయంలో సూర్య మన ప్రేక్షకులపై చూపించే ప్రేమ ఎలాంటిది.. హుద్ హుద్ టైంలో అతనెంత ఉదారంగా స్పందించాడు అన్నది జనాలకు తెలియంది కాదు.