Begin typing your search above and press return to search.
తలైవా తొందరపడ్డారా!
By: Tupaki Desk | 4 Nov 2018 6:30 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ మీద 2.0 గురించి రెండు రకాల కోణాల్లో ఒత్తిడి ఉంది. గత సినిమాలు మూడేళ్లుగా వరుసగా నిరాశ పరుస్తున్న నేపథ్యంలో బయ్యర్ల నుంచి బయటికి కనిపించని ప్రెజర్ ఉంది. దానికి తోడు లింగా-కబాలి-కాలా ఏదీ మెప్పించలేక అంతంత మాత్రంగానే ఆడటం ఇతర రాష్ట్రాల్లో మార్కెట్ ని బాగా ప్రభావితం చేసింది. కేవలం తానుంటే సరిపోదని బలమైన కథా కథనాలు ఉంటే తప్ప ప్రేక్షకులు ఆదరించరని రజని లాంటి సీనియర్ హీరో గుర్తించలేరని కాదు. అయినా కూడా వెనుక సినిమాల ప్రభావం లేకుండా కొత్త వాటిని ప్రమోట్ చేయడం కత్తి మీద సామే.
నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ లో మైకు ముందుకు రాగానే రజని రాసుకోండి ఇది సూపర్ హిట్ అని ఏదో కమర్షియల్ సినిమాను ప్రమోట్ చేసినట్టు చెప్పడం విని అందరు ఆశ్చర్యపోయారు. నిజానికి శంకర్ మాయాజాలం గురించి ఇందులో ఉన్న సాంకేతిక అద్భుతాల గురించి ముందు మాట్లాడి ఆ తర్వాత హిట్ కొడతాం అని చెబితే వేరుగా ఉండేది కానీ వెరైటీగా హిట్ అవుతుంది రాసుకోండి అని చెప్పడం కాస్త అనుమానం రేపింది. ఇలా అందరు హీరోలు అన్ని సినిమాలకు మాట్లాడ్డం సర్వ సాధారణం. అంత దాకా ఎందుకు. నాలుగు నెలల క్రితం కాలా వేడుకలో ధనుష్ తో సహా రజని ఇంచుమించు ఇదే తరహాలో మాట్లాడాడు. అయితే ఫలితం ఏమైందో చూసాం.
కానీ 2.0 కేసు వేరు. ఇదో మాములు సినిమాగా ఎవరూ ఆశించడం లేదు. ఒక విజువల్ వండర్ ని చూడబోతున్నాం అని ప్రిపేర్ అవుతున్నారు. కనీస స్థాయిలో కంటెంట్ ఉంటే చాలు రికార్డుల ఊచకోత ఖాయం. కానీ ఇలా సూపర్ హిట్ ఖాయం అని ముందే చెప్పడం చూసి తలైవా తొందరపడ్డారా అనే కామెంట్స్ చెన్నై మీడియా సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. నిజంగా బ్లాక్ బస్టర్ అయితే సమస్య లేదు కానీ ఏ మాత్రం తేడా వచ్చినా ఈ రాసుకోండి మాటే ట్రాలింగ్ కు అవకాశం ఇస్తుంది. మరో పాతిక రోజుల్లో ఇది తేలిపోతుంది