Begin typing your search above and press return to search.
ఫ్యామిలీ కోర్టులో సూపర్ స్టార్ కూతురు!
By: Tupaki Desk | 23 Dec 2016 11:30 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ తన భర్త అశ్విన్ రామ్ కుమార్ నుంచి విడాకులు తీసుకోనున్నారని కథనాలు వచ్చిన నేపథ్యంలో... ఇది వాస్తవమేనని సౌందర్య ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. "నా వివాహం గురించి వస్తున్న వార్తలు నిజమే.. ఒక ఏడాదిగా మేము విడిగానే ఉన్నాం.. నా వ్యక్తిగత, కుటుంబ విషయాలకు సంబంధించి గోప్యతను గౌరవించాలని కోరుకుంటున్నా" అని సౌందర్య ట్వీట్ చేశారు. అయితే దీనికి సంబందించి తాజాగా సౌందర్య చెన్నై ఫ్యామిలీ కోర్టులో కనిపించారు. విడాకుల పిటిషన్ విచారణలో భాగంగా ఆమె ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారని, ఈ హాజరీతో విడాకుల కార్యక్రమం దాదాపు పూర్తి అయినట్లేనని తెలుస్తుంది!
కాగా 2010లో సౌందర్య వ్యాపారవేత్త అశ్విన్ రామ్ కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం 2015లో వీరికి కొడుకు పుట్టాడు. అతడి పేరు వేద్. అయితే వివిధ పరిణామాల నేపథ్యంలో వీరు విడాకులు తీసుకుంటున్నారని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో కూతురు – అల్లుడి మధ్య రాజీ కోసం రజనీకాంత్ తీవ్రంగానే ప్రయతించారని, అయితే అది ఏమాత్రం కుదరలేదని అంటున్నారు. ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాతే సౌందర్య తన విడాకులకు సంబందించిన విషయాన్ని అనౌన్స్ చేసిందని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/