Begin typing your search above and press return to search.
దీని అర్థమేమి కరి ’కాలా’?
By: Tupaki Desk | 2 March 2018 9:27 AM GMTసూపర్ స్టార్ రజనికాంత్ కాలా టీజర్ వచ్చేసింది. అందరూ చూసేసారు. రివ్యూలు కూడా పెట్టేసారు. ఇక్కడి దాకా ఓకే. ఎందుకో సాధారణంగా రజిని కొత్త సినిమా టీజర్ వస్తోంది అంటే కనిపించే జోష్ దీని విషయంలో మాత్రం కాస్త తక్కువగా అనిపించిన మాట వాస్తవం. ప్రమోషన్ విషయంలో జరిగిన పొరపాటో లేక రజని గత సినిమాలన్నీ ఒక దాన్ని మించి ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడమో కాని తెలుగులో మాత్రం భారీ పోటీ మధ్య విడుదల అవుతున్న కాలాకు ఈ సారి పరీక్ష నెగ్గడం అంత ఈజీ కాదు. ముందు భరత్ పేరుతో మహేష్ బాబు - తర్వాత సూర్య రూపంలో అల్లు అర్జున్ టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు. ఇక టీజర్ గురించి ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ఉన్న డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
ఇందులో రజని చెప్పే డైలాగ్ ఒకటుంది. నలుపు - శ్రమ జీవుల వర్ణం-మావాడకు వచ్చి చూడు మురికి కూడా ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది అని. అసలు ఇక్కడ తాను నల్లగా ఉన్నందుకు దర్శకుడు రంజిత్ పా అది డిఫెండ్ చేసుకోవడానికి ఇది పెట్టాడా లేక అణుగారిపోతున్న బడుగుజీవుల తరఫున ఒక స్టేట్మెంట్ ఇప్పించాడా ఫాన్స్ కు అర్థం కావడం లేదు. సినిమా మొత్తం రజని నల్ల దుస్తుల్లోనే ఉంటాడు కాబట్టి దానికి వివరణ ఇచ్చేలా ఈ సంబాషణ ఉంటుందని మరో విశ్లేషణ ఉంది. తన భావాలను కబాలి సినిమాలోనే బయటపెట్టే ప్రయత్నం చేసిన రంజిత్ పా ఇందులో కూడా అలాంటివి చేసాడేమో అని భయపడుతున్నారు.
కాలా టీజర్ నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేసిన అభిమానులు ఆ రేంజ్ లో ఇది కట్ చేయకపోవడం వల్ల కొంత నిరాశ చెందుతున్నారు. నిమిషం నిడివికే సినిమాను డిసైడ్ చేయలేరు కాని కబాలిలాగా రంజిత్ పా ఇందులో స్వంత పైత్యం చూపకుండా ఉంటే చాలని కోరుకుంటున్నారు. కబాలిలో రజని అనాధ శరణాలయానికి వచ్చినప్పుడు అందులో ఆర్టిస్టులతో రంజిత్ చేయించిన ఓవర్ యాక్షన్ ఇంకా ఫాన్స్ మర్చిపోలేదు. అలాంటివి ఏమి లేకుండా రెగ్యులర్ మాస్ మసాలా సినిమా ఇవ్వు అంటున్న వాళ్ళ కోరిక ఎంత వరకు నెరవేరుతుందో ఏప్రిల్ 27 తేలిపోతుంది.
చివరిగా మరో ట్విస్ట్. టీజర్ బయటికి రాగానే ఇతర బాషల నుంచి బయ్యర్స్ ఎగబడతారు అనే నిర్మాత ధనుష్ లెక్క తప్పేలా ఉంది. 40 కోట్ల దాకా తెలుగు వెర్షన్ కు ఆశిస్తున్న ధనుష్ చెప్పిన మొత్తాన్ని పెట్టేందుకు మన నిర్మాతలు సిద్ధంగా లేరు. మరి టీజర్ లో వేసుకున్న తన బ్యానర్ పేరు మీదే తెలుగులో విడుదల చేస్తాడా లేక కబాలి అనుభవాన్ని మర్చిపోయి ఎవరైనా నిర్మాత ధనుష్ అడిగినంత ఇచ్చే సాహసం చేస్తాడా వేచి చూడాలి.