Begin typing your search above and press return to search.
కోలీవుడ్ లో ముదురుతున్న కలెక్షన్స్ వార్
By: Tupaki Desk | 18 Jan 2019 7:03 AM GMTఅన్ని ఇండస్ట్రీల్లోకి తమిళ ఇండస్ట్రీ కాస్త వేరు, ఆ విషయం ప్రతి స్టార్ హీరో సినిమా విడుదల సమయంలో నిరూపితం అవుతూనే ఉంది. స్టార్ హీరోల ఫ్యాన్స్ అక్కడ విపరీతమైన సందడి చేస్తూ ఉంటారు. ఆ సందడి అప్పుడప్పుడు అదుపు తప్పడం - శృతి మించడం కూడా జరుగుతుంది. తాజాగా కోలీవుడ్ లో ఒకే రోజున సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు స్టార్ హీరో అజిత్ ల సినిమాలు విడుదల అయ్యాయి. ఒకే రోజు విడుదల అవ్వడంతో తమిళనాడు మొత్తం సందడి వాతావరణం కనిపించడంతో పాటు - అక్కడక్కడ గొడవ వాతావరణం కూడా కనిపించింది.
రజినీకాంత్ 'పేట' మరియు అజిత్ 'విశ్వాసం' చిత్రాలు రెండు కూడా భారీగా వసూళ్లను రాబట్టాయి. రెండు సినిమాలకు సూపర్ హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో అభిమానులు తమ హీరో కలెక్షన్స్ గ్రేట్ అంటే తమ హీరో కలెక్షన్స్ ఎక్కువ అంటూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. అజిత్ 'విశ్వాసం' చిత్రం నిర్మాతలు కలెక్షన్స్ ప్రకటించడంతో వివాదం మొదలైంది. నాలుగు రోజుల్లోనే వంద కోట్లు వసూళ్లు వచ్చాయంటూ విశ్వాసం చిత్ర నిర్మాతలు ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రం వరకు పేట కంటే విశ్వాసం సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటూ నిర్మాతలు ప్రకటించిన నేపథ్యంలో రజినీకాంత్ అభిమానులు రెచ్చి పోయారు.
సోషల్ మీడియాలో రజినీకాంత్ అభిమానులు రెచ్చి పోవడంతో పాటు - పేట నిర్మాతలపై ఒత్తిడి తీసుకు రావడం జరిగింది. దాంతో పేట నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కలెక్షన్స్ ను అధికారికంగా ప్రకటించింది. 11 రోజుల్లో 100 కోట్లను వసూళ్లు చేసిన పేట తమిళనాడులో అతి వేగంగా వంద కోట్లు సాధించిన చిత్రంగా రికార్డు సాధించిందంటూ ప్రకటించారు. సన్ పిక్చర్స్ ప్రకటనతో అజిత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫాస్టెస్ట్ వంద కోట్లు అంటూ పేటను పేర్కొనడంపై అజిత్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. అజిత్ మూవీ వారం రోజుల్లో వంద కోట్లు రాబడితే వాటిని అబద్ద అన్నట్లుగా సన్ పిక్చర్స్ సంస్థ ప్రకటన ఉందని అజిత్ ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి కలెక్షన్స్ వివాదం తమిళనాట పీక్స్ కు చేరింది.