Begin typing your search above and press return to search.
సీక్రెట్ గా బెంగళూరులో రజినీకాంత్ ఎవరిని కలిశాడో తెలుసా?
By: Tupaki Desk | 7 Dec 2020 1:38 PM GMTతమిళ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన రజినీకాంత్ ఇప్పుడు అందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టారు. పార్టీకి సంబంధించిన కష్టనష్టాలపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. తనకు సన్నిహితులైన వారిని, గురువులను కలిసి చర్చలు చేస్తున్నారు. వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
తాజాగా రజినీకాంత్ బెంగుళూర్ లో నివాసం ఉండే తన అన్నయ్య సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయన కాళ్లకు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. తానూ ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా.. అన్నయ్య ముందు చాలా చిన్నపిల్లాడిలానే రజినీ ఉంటాడట. ఆయన ఫొటోలు చూస్తే అదే అనిపిస్తోంది.
ఏ పని చేసిన తన అన్నయ్యకు చెప్పకుండా రజినీకాంత్ చేయడట... నిజానికి రజినీకాంత్ కి అన్నయ్య ఉన్నట్లే చాలామందికి తెలియదు. కానీ రజిని తన అన్నయ్యను తండ్రిగా భావిస్తాడట. అలాగే కమల్ హాసన్ సహా కోలీవుడ్ లోని తన స్నేహితులను కూడా రజినీకాంత్ కలిసి వారి మద్దతు, దీవెనలు కోరుతాడని తెలుస్తోంది.
అసలు రజినీకాంత్ రాజకీయాలోకి రావాలని 1990లలోనే అనుకున్నాడు. కాకపోతే అప్పటి సినిమాల బిజీలో రజినికి సమయం కుదరలేదు. కలిసి రాలేదు. కానీ తన మద్దతును మాత్రం రజినీకాంత్ బాహాటంగానే ప్రకటించాడు. ముఖ్యంగా జయలలితకి ఓటేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడని 20 ఏళ్ల క్రితం రజినీకాంత్ అన్న మాటకు ఆమె పార్టీ అప్పుడు ఘోరంగా ఓడింది. ఆ లెవల్లో రజినీకాంత్ కి అప్పుడు ఫాలోవింగ్, ఇమేజ్ ఉండేది. కానీ ఇప్పుడు కూడా ఆ రేంజ్ ఇమేజ్ ఉందా లేదా అన్నది వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో తేలనుంది.