Begin typing your search above and press return to search.

చివరికి రజినీ గెలిచాడుగా..

By:  Tupaki Desk   |   23 Feb 2018 3:37 AM GMT
చివరికి రజినీ గెలిచాడుగా..
X
ఏప్రిల్ చివరి వీకెండ్లో ఏముందో ఏమో కానీ.. దాని కోసం నెలకొన్న పోటీ అంతా ఇంతా కాదు. ఏప్రిల్ 27వ తేదీకి ముందుగా ‘నా పేరు సూర్య’ కోసం బెర్తు బుక్ చేస్తే.. ఆ తర్వాత ‘భరత్ అనే నేను’ లైన్లోకి వచ్చింది. ఇరు చిత్రాల నిర్మాతల ఎవరికి వాళ్లు భీష్మించుకుని కూర్చున్నారు. ఎవ్వరికి వాళ్లు పట్టుదల ప్రదర్శించారు. ఇంతలో రజినీ సినిమా ‘కాలా’ అదే తేదీకి ఫిక్సయింది. దీంతో బన్నీ.. మహేష్ సినిమాల్ని ఒక రోజు వెనక్కి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగి ఒక సినిమాను ముందుకు.. మరో సినిమాను వెనక్కి జరుపుకున్నారు. అంతే తప్ప ఏప్రిల్ వారాంతాన్ని వాడుకోవాలని చూడలేదు.

ఇరు చిత్రాల నిర్మాతలు చర్చలు జరపడం.. రెండు సినిమాల మధ్య ఎడం ఉండేలా అవగాహనకు రావడం బాగానే ఉంది కానీ.. అంత పట్టుదలగా ఏప్రిల్ చివరి వారాంతం కావాలన్న వాళ్లు దాన్నెందుకు రజినీ సినిమాకు వదిలేశారన్నది అర్థం కాని విషయం. వీటిలో ఏదో ఒక సినిమాను అదే వీకెండ్లో ఉంచేసి.. ఇంకోదాన్ని ముందు రెండు వారాలకో.. వెనక రెండు వారాలకో వాయిదా వేయొచ్చుగా? ‘2.0’ ఏప్రిల్ 27కు వస్తుందని రూమర్ వచ్చినపుడు ఛాన్సే లేదన్న వాళ్లు ‘కాలా’కు నేరుగా డేట్ ఇచ్చేసినా కిమ్మనలేదు. ఇప్పుడు రెండు సినిమాల డేట్లూ మార్చుకుని ‘కాలా’కు డేట్ ఇచ్చారు. వీళ్ల అవగాహన సంగతేమో కానీ.. దీని వల్ల రజినీ చిత్రం లాభపడింది. ‘కాలా’ చిత్ర నిర్మాతలతో చర్చలేమైనా జరిగాయో ఏమో తెలియదు ఈ వ్యవహారంలో ఎక్కువ లాభ పడింది మాత్రం రజినీ సినిమా.