Begin typing your search above and press return to search.
మనసున్న సూపర్ స్టార్..
By: Tupaki Desk | 10 April 2020 10:30 AM GMTకరోనా.. ఇపుడు పేరు చెబితేనే ప్రపంచం గజగజ వణికిపోతుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇపుడు దేశా దేశాలనే చుట్టేస్తోంది. అంతేకాదు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నాం చేస్తోంది. దీంతో అప్రమత్తమైన జనం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మన దేశంలో లాక్ డౌన్ అమలులో ఉంది. కరోనా దెబ్బకు బీదా - గొప్ప - ఆడా - మగా తేడా లేకుండా అందరు ఆసుపత్రి పాలవుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు పరిశ్రమలు స్థంభించిపోయాయి. కరోనా వైరస్ ధాటికి సమస్తం షూటింగ్స్ సహా సమస్తం బంద్ అయ్యాయి. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇంటికే పరిమితమయ్యారు.
ఇటీవల హీరో కమల్ హాసన్. కరోనా చికిత్స కోసం తన ఇంటిని ఆసుపత్రిగా మార్చలనుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఆయన ట్వీట్ కూడా చేసారు. ఇక తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా కమల్ బాటలోనే రానున్నారట. కరోనా బాధితుల ఐసొలేషన్ కోసం తనకు సంబంధించిన కోడంబాక్కంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపాన్ని ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయం పై అనుమతి కోసం తమిళనాడు ప్రభుత్వానికి కూడా లేఖ రాశారట. సూపర్ స్టార్ కి సహాయం చేయడం కొత్త ఏం కాదు. ఇంతకుముందు చెన్నైలో వరదలు వచ్చినప్పుడు ఇళ్లులేని పేదల కోసం తన ప్రాపర్టీని సమర్పించాడు. ఇప్పుడు కరోనా బాధితుల కోసం ప్రాపర్టీని ఇవ్వనుండడం తో తలైవా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.