Begin typing your search above and press return to search.
ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే
By: Tupaki Desk | 3 Nov 2015 7:30 PM GMTరజినీకాంత్.. సౌతిండియా సూపర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకున్నా.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న స్టార్. ఈనెల 12తో రజినీకి 65 ఏళ్లు నిండుతాయంటే నమ్మడం కష్టమే. ప్రస్తుతం రజినీకాంత్ చేస్తున్న మూవీ కబాలి షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. ఇండియా తర్వాత రజినీ సినిమాలకు అతి పెద్ద మార్కెట్ మలేషియానే. తమిళ ప్రజలు - వారి వారుసులు ఎక్కువగా ఇక్కడ నివసించడమే దీనికి కారణంగా చెప్పచ్చు. ఏకంగా మలేషియా ప్రధాని కూడా రజినీకాంత్ ఫ్యాన్ అంటే.. ఇక్కడ ఆయనకున్న క్రేజ్ అర్ధమవుతుంది.
రజినీ రీసెంట్ మూవీ లింగ. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లు కొల్లగొట్టినా సరే ఈ చిత్రం ఫ్లాప్ అనిపించుకుంది. దీంతో తర్వాతి ప్రాజెక్టును చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. తనతో ఎప్పుడూ సినిమాలు చేసే డైరెక్టర్లకు కాకుండా.. కొత్త దర్శకుడు రంజిత్ చేతిలో కబాలిని పెట్టారు రజినీ. విషయం ఏంటంటే.. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసినా కూడా లింగా అట్టర్ ఫ్లాపే అయ్యింది. పైగా పంపిణీదారులు డబ్బులు తిరిగివ్వమని రచ్చ చేయడం పెద్ద ఇష్యూ అయ్యింది. ఈ సినిమాకు ముందు కొచ్చాడయాన్ అనే యానిమేషన్ సినిమా కూడా సూపర్ ఫ్లాపే. అందుకే రజనీ కెరియర్ లో కబాలి బ్లాక్ బస్టర్ అనేది చాలా కీలకమైన అంశం. ఈ సినిమా తేడా టాక్ తెచ్చకుందో.. రజనీకి కూడా ఇక తలనొప్పి మొదలవుతుంది.
ఇక కబాలి గురించి చూస్తే.. ఈ మూవీలో సూపర్ స్టార్ కి రొమాంటిక్ సన్నివేశాలు ఉండవని తెలుస్తోంది. వయసు మీరిన డాన్ గా రజినీకాంత్ తన విశ్వరూపం చూపించబోతున్నారు. ఆయన భార్యగా రాధికా ఆప్టే నటిస్తుంటే.. కూతురి రోల్ లో ధన్సిక కనిపించనుంది. విలన్ గ్యాంగ్ కూతురుని కిడ్నాప్ చేస్తే.. తన నెట్ వర్క్ ని ఉపయోగంచుకుని ట్రేస్ చేసే సీరియస్ డాన్ కేరక్టర్ లో రజినీకాంత్ కనిపంచనున్నట్లు టాక్. వచ్చే సమ్మర్ కి రిలీజ్ అయ్యే ఛాన్సుంది.