Begin typing your search above and press return to search.
అసలు రజనీకాంత్ కు ఏమైంది??
By: Tupaki Desk | 23 Feb 2016 6:40 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ ను నిన్నమార్నింగ్ చెన్నయ్ లోని ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఎడ్మిట్ చేశారని ఇప్పటికే ఒక న్యూస్ చెక్కర్లు కొడుతోంది. ఇంతలోనే ఆయన డిశ్చార్జ్ కూడా అయ్యారని మరో వార్త కూడా వచ్చేసింది. అయితే ఇంతకీ ఆయనకు ఏమైంది? ఏదైనా సీరియస్సా?
అబ్బే అంత లేదు. నిజానికి గత మూడు నెలల నుండి సూపర్ స్టార్ రజనీ మలేషియాలో 'కబాలి' సినిమా కోసం షూటింగ్ చేస్తున్నారు. అంతే కాకుండా మధ్యలో రెండుసార్లు ఇండియా వచ్చి గోవాలో ఒక కొత్త షెడ్యూల్ లో కూడా పాల్గొన్నారు. ఇలా కంటిన్యూషన్ గా షూటింగ్ చేయడం వలన ఆయనపై విపరీతమైన ప్రెజర్ పడిందట. ఇక మరో వారంలో రజనీ తన కొత్త సినిమా రోబో 2.0 తాలూకు యాక్షన్ సన్నివేశాలకు షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. అందుకే ఈలోపే ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకుందాం అని నిన్న హాస్పిటల్ కు వెళ్లారట.
ఇక కొత్త షెడ్యూల్మొదలయ్యే వరకు కాస్త రెస్ట్ తీసుకోవాలని ఆయన్ను డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ అభిమానులు కంగారుపడాల్సిన అవసరం లేదు.