Begin typing your search above and press return to search.
రోబోకు బదులు కాలా... ఇది రజనీ ప్లాన్
By: Tupaki Desk | 22 Feb 2018 10:27 AM GMTరోబో సీక్వెల్‌గా వస్తున్న 2.0 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటే... ఆ సినిమా విడుదల మాత్రం వాయిదా పడుతూ వెనక్కి పోతోంది. ఈ విషయంలో చాలా అప్‌సెట్ అవుతున్నారు రజనీ ఫ్యాన్స్. వారికి కాస్త ఉత్సాహాన్ని ఇచ్చేందుకు కాలాను రంగంలోకి దించింది చిత్రయూనిట్. ఈ ఐడియా ఇచ్చింది రజినీనేట.
2.0 సినిమాలో మొదట ఏప్రిల్ 27న విడుదల చేస్తామని ప్రకటించింది చిత్రయూనిట్. ఇప్పటికీ సినిమాలు పనులు పూర్తికాలేదు. ఇంకా గ్రాఫిక్స్ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకోసం శంకర్ లాస్ ఏంజలస్ లోనే తిష్ట వేసుకుని కూర్చున్నాడు. బాహుబలిని మించిన రికార్డు సాధించాలన్న తహతహతో సినిమాను ఇంకా చెక్కుతూనే ఉన్నాడు శంకర్. అతని పద్దతి లైకా ప్రొడక్షన్ వారికి కూడా కోపం తెప్పిస్తోంది. ఇప్పటికీ సినిమా విడుదల తేదీ ఖరారు చేసే పరిస్థితి లేదు. అంచనా ప్రకారంలో ఆగస్టులో విడుదలయ్యే అవకావం ఉంది. కాగా ఈ పరిస్థితులు రజినీ ఫ్యాన్స్‌లో నిరుత్సాహాన్ని నింపుతున్నాయి. వారికి ఊపునిచ్చేందుకు... శంకర్ - లైకా సంస్థల మధ్య వచ్చిన అభిప్రాయ బేధాలు సర్దుకునేందుకు రజినీ సూపర్ ప్లాన్ వేశాడంట.
షూటింగ్ అయిపోయి రెడీగా ఉన్న కాలా సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయమని ఆయనే చిత్రయూనిట్ కు సలహా ఇచ్చాడట. ఇందులో కూడా రజినీ గ్యాంగ్ స్టర్ గానే నటించాడు. ఈ సినిమా తరువాత ఆగస్టులోనో లేక దీపావళికో 2.0 విడుదల చేసేందుకు ప్లాన్ చేయవచ్చన్నది ఆయన ఉద్దేశమంట. అంతేకాదు శంకర్... లైకా సంస్థల మధ్య సయోధ్య కుదిరేందుకు కాస్త సమయం కూడా ఇచ్చినట్టు అవుతుందని రజినీ అభిప్రాయపడ్డారట.