Begin typing your search above and press return to search.
నంబవర్ వన్.. నంబర్ టు.. ఒకే వేదికపై
By: Tupaki Desk | 12 Sep 2018 6:45 AM GMTతమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాల బడ్జెట్.. బిజినెస్.. ఆయన మార్కెట్ అన్నీ కూడా మరో స్థాయిలో ఉంటాయి. రజనీ రేంజ్ అందుకోవడం వేరే హీరోలకు అసాధ్యమనే చెప్పాలి. ఐతే రజనీ తర్వాత ఆయన స్థాయికి దగ్గరగా వచ్చిన హీరోల్లో విజయ్ పేరు ముందు చెప్పుకోవాలి. గత దశాబ్దంలో తిరుగులేని విజయాలతో తన మార్కెట్‌ను బాగా పెంచుకున్నాడు విజయ్. ‘తుపాకి’.. ‘కత్తి’.. ‘మెర్శల్’ లాంటి బ్లాక్ బస్టర్లు అతడిని పెద్ద రేంజికి తీసుకెళ్లాయి. రజనీ తర్వాత తమిళంలో అత్యధిక మార్కెట్ ఉన్నది అతడికే. తమిళ సినీ పరిశ్రమలో రజనీ తర్వాతి స్థానం విజయ్ దే అని చెప్పాలి. రజనీ లాగే విజయ్ కి కూడా వ్యక్తిగతంగా మంచి పేరుంది. వివాదాల జోలికి వెళ్లడు. పబ్లిసిటీ కోరుకోడు. సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తుంటాడతను.
రజనీ రాజకీయాల్లోకి వెళ్లనున్న నేపథ్యంలో సినీ రంగంలో ఆయన స్థానం విజయ్ దే అంటుంటారు తమిళ జనాలు. విశేషం ఏంటంటే విజయ్ కొత్త సినిమా ‘సర్కార్’ ఆడియో వేడుకలో అతడితో పాటు రజనీని చూడబోతున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రజనీనే రాబోతున్నాడు. ఈ అపూర్వ కలయిక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వేడుకలో రజనీ.. విజయ్ ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. విజయ్‌తో వ్యక్తిగతంగా రజనీకి మంచి స్నేహమే ఉన్నట్లు తమిళ పరిశ్రమలో చెప్పుకుంటారు. ఇక ‘సర్కార్’ దర్శకుడు మురుగదాస్ తోనూ రజనీకి మంచి సంబంధాలే ఉన్నాయి. నిజానికి వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేయడానికి ప్రయత్నం కూడా జరిగింది కానీ.. కుదరలేదు. రజనీ భవిష్యత్తులో రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకుని మళ్లీ సినిమా చేస్తే మురుగదాస్ తో పని చేసే అవకాశాలున్నాయి. ‘సర్కార్’ విషయానికొస్తే ‘తుపాకి’.. కత్తి’ల తర్వాత మురుగదాస్-విజయ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఎ.ఆర్.రెహమాన్ దీనికి సంగీతాన్నందిస్తున్నాడు.