Begin typing your search above and press return to search.

29 ట్వీట్లతో 30 లక్షల మంది ఫాలోవర్లు

By:  Tupaki Desk   |   15 Jun 2016 3:08 PM IST
29 ట్వీట్లతో 30 లక్షల మంది ఫాలోవర్లు
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల కిందటే ట్విట్టర్లోకి అడుగుపెట్టాడు. మామూలుగా పవర్ స్టార్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ ట్విట్టర్లో మాత్రం ఆయనకు అనుకున్న స్థాయిలో ఫాలోవర్లు పెరగలేదు. దీనికి కారణం.. ఆయన ట్విట్టర్లో యాక్టివ్ గా లేకపోవడమే. అప్పుడప్పుడూ ఓ పొలిటికల్ మెసేజ్ పెట్టడం తప్పితే.. తన సినిమాల గురించి కానీ.. వ్యక్తిగత జీవితం గురించి ముచ్చట్లు చెప్పడు పవన్. అందుకే పవన్ ఫాలోవర్ల సంఖ్య ఇంకా మిలియన్ మార్కుకు చేరలేదు. గత ఏడాది ట్విట్టర్లోకి వచ్చిన అల్లు అర్జున్ పరిస్థితి కూడా ఇంతే. అతడి ఫాలోవర్ల సంఖ్య 8 లక్షల మార్కుకు చేరువగా ఉంది. అతను కూడా ట్విట్టర్లో అంత యాక్టివ్ గా ఏమీ ఉండడు. తమిళ హీరో సూర్య కూడా గత ఏడాదే ట్విట్టర్లోకి రాగా.. అతడి ఫాలోవర్ల సంఖ్య 9.5 లక్షలుగా ఉంది.

ఐతే ఇక్కడ సూపర్ స్టార్ రజినీకాంత్ సంగతి చూడండి. ఆయన ట్విట్టర్లోకి వచ్చి ఇంకా రెండేళ్లు కూడా కాలేదు. ట్విట్టర్లో ఆయనేమీ అంత యాక్టివ్‌ గా ఉండడు. ఇప్పటిదాకా పెట్టిన ట్వీట్లు కేవలం 29 మాత్రమే. అందులో కూడా ఆసక్తికరమైనవి ఏమీ లేవు. ఏవైనా స్పెషల్ డేస్ వస్తే విష్ చేస్తాడంతే. అయినప్పటికీ ఆయన ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 30 లక్షలకు చేరుకుంది. సౌత్ ఇండియన్ సెలబ్రెటీస్ లో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి రజినీనే అని భావిస్తున్నారు. ఆయన తర్వాతి స్థానంలో హీరోయిన్లు ఉండటం విశేషం. రజనీ తరువాత త్రిష 2.6 మిలియన్ ఫాలోవర్లతో రజనీ తరువాత ఉండగా ఆ తరువాత సమంత 2.4 మిలియన్ ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉంది. టాలీవుడ్ హీరోల్లో అత్యధికంగా మహేష్ బాబు 22 ల‌క్ష‌ల మంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.